Anupam Kher: నిజాయతీపరులు మరీ నిజాయతీగా ఉండకూడదు.. ఎన్నికల ఫలితాలపై నటుడి పోస్ట్ వైరల్!

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. నిజాయతీపరుడైన వ్యక్తి మరీ నిజాయతీగా ఉండకూడదని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటుంది. నిటారుగా ఉన్న చెట్టు పైనే సహజంగా గొడ్డలి వేటు పడుతుంటుందంటూ రాసుకొచ్చిన ఆయన పోస్ట్ వైరల్ అవుతోంది.

New Update
Anupam Kher: నిజాయతీపరులు మరీ నిజాయతీగా ఉండకూడదు.. ఎన్నికల ఫలితాలపై నటుడి పోస్ట్ వైరల్!

Bollywood: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. నీజాయతిపరులు మరీ నిజాయతిగా ఉండకూడదంటూ ఎరరి పేరు ప్రస్తావించకుండా నెట్టింట పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ మేరకు అనుపమ్ ఏమన్నారంటే.. 'నిజాయతీపరుడైన వ్యక్తి మరీ నిజాయతీగా ఉండకూడదని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటుంది. నిటారుగా ఉన్న చెట్టు పైనే సహజంగా గొడ్డలి వేటు పడుతుంటుంది. నిజాయతీపరుడు తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా నిజాయతీని వదులుకోడు. అందుకే ఆ వ్యక్తి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాడు’ అంటూ రాసుకొచ్చాడు. ఇక దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్, నెటిజన్లు బీజేపీ ఫలితాలపై తన అభిప్రాయం వ్యక్తం చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు కంగ్రాట్స్ చెప్పారు. కంగన రాజకీయాల్లోకి అడుపెట్టిన మొదటిసారి ఘన విజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు