ANR Centenary Celebrations: నట సామ్రాజ్ అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) శత జయంతి నేడు. ఆయన జయంతిని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోలో (Annapurna Studios) అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. ఈ విగ్రహాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఆవిష్కరించనున్నారు. ఇవాళ ఉదయం జరుగనున్న ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అక్కినేని కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.
ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు..
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులు ఆయన ఘన స్వాగతం పలికారు.
అక్కినేనితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి..
అక్కినేని నాగేశ్వరరావు శతజయంతిని పురస్కరించుకుని ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ట్వీట్ చేసిన చిరంజీవి.. '' అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికి ఉన్నంత వరకు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి, నా సోదరుడు నాగార్జునకి, నాగేశ్వరరావుగారి కోట్లాది మంది అభిమానులకు, సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.
ANR విగ్రహానికి నివాళులర్పించిన మహేష్ బాబు..
అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు లైవ్ మీకోసం..
Also Read:
India Canada Row : పరువు పోగొట్టుకున్న కెనడా..మండిపడుతున్న అగ్రదేశాలు..!!
Weather: ఆంధ్రప్రదేశ్ వాసులకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్..!