MLA Pinnelli : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మరోసారి హైకోర్టు (High Court) మెట్లెక్కారు.హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. పిన్నెల్లి తనకు కౌంటింగ్ ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు . పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై రెండు హత్యాయత్నం కేసులు (Murder Attempt Cases) నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్ 307 కింద ఆయనను ప్రధాన నిందితుడిగా ఎఫ్‌ఐఆర్ లో చేర్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాజకీయ కక్షతోనే తనపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని పిన్నెల్లి పిటిషన్‌లో వివరించారు. మరోవైపు ఈవీఎం (EVM) ధ్వంసం కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దని హైకోర్టు సూచించింది. పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీచేసింది. మాచర్లకు వెళ్లకూడదని పిన్నెల్లికి హైకోర్టు షరతులు విధించింది.
Also read: కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ..విశ్రాంత జడ్జి మృతి!