Macherla MLA : మరోసారి కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. ఎందుకంటే! మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి హైకోర్టు మెట్లెక్కారు.హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. పిన్నెల్లి తనకు కౌంటింగ్ ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. By Bhavana 27 May 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి MLA Pinnelli : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మరోసారి హైకోర్టు (High Court) మెట్లెక్కారు.హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. పిన్నెల్లి తనకు కౌంటింగ్ ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు . పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై రెండు హత్యాయత్నం కేసులు (Murder Attempt Cases) నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్ 307 కింద ఆయనను ప్రధాన నిందితుడిగా ఎఫ్‌ఐఆర్ లో చేర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ కక్షతోనే తనపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని పిన్నెల్లి పిటిషన్‌లో వివరించారు. మరోవైపు ఈవీఎం (EVM) ధ్వంసం కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దని హైకోర్టు సూచించింది. పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీచేసింది. మాచర్లకు వెళ్లకూడదని పిన్నెల్లికి హైకోర్టు షరతులు విధించింది. Also read: కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ..విశ్రాంత జడ్జి మృతి! #andhra-pradesh #high-court #pinnelli-ramakrishna-reddy #politics #macherla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి