Rajya Sabha: రాజ్యసభలో తగ్గిన ఎన్డీయే (NDA) సంఖ్యా బలం తగ్గింది. మెజారిటీ మార్క్ 113 కంటే ఎన్డీయేకు 12 సీట్లు తక్కువ అయ్యాయి. ప్రస్తుత సంఖ్యా బలం 101గా ఉంది. ఇటీవలే నలుగురు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎన్డీయేకు సీట్లు తగ్గాయి. మరోవైపు ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణలో (Telangana) ఆయన రాజీనామాతో కాంగ్రెస్ కు (Congress) రాజ్యసభలో మరో సీటు లభించినట్టు అయింది. ఇదిలా ఉంటే తనకు రాజ్యసభ సీటు ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇటీవల మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. మరి కాంగ్రెస్ తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎవరిని పంపుతుందో వేచి చూడాలి.
Also Read: డ్రగ్స్ కేసులో నటి రకుల్ సోదరుడు అరెస్ట్.. భారీగా కొకైన్ స్వాధీనం!