BRS Party: లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహలు రచిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి నేతల రాజీనామాలు పెద్ద తలనొప్పిగా మారాయి. సొంత పార్టీ నేతలను కాపాడుకోవడం కష్టంగా మారింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్.
ALSO READ: జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు
కేసీఆర్ గుండెకు గాయం చేసిన నేతలు..
తనతోనే చిరకాలం ఉంటారని అనుకున్నారు.. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తనకు ఊహించని షాక్ ఇస్తాయని అనుకోలేదు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందగానే ఒకరి వెనక ఒకరు పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల తనకు నమ్మకస్థులు.. పార్టీ కష్ట కాలంలో తనను విడువరు అని అనుకున్న కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు కేశవరావు కేసీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చారు. వారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. పదవుల కోసం తనను కష్టకాలంలో విడిచి వెళ్తారా? అని కేసీఆర్ వారిని పిలిచి అడిగినట్లు తెలుస్తోంది. అయినా.. వారు ససేమీరా అంటూ బీఆర్ఎస్ కి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది.
కేసీఆర్ ను వీడండి.. పదవులు పొందండి..
కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకుంటుంది కాంగ్రెస్. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఊసే లేకుండా చేయాలని చెప్పి కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. 10 ఏళ్లు తెలంగాణలో చక్రం తిప్పిన కేసీఆర్ ను ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే పనిలో పడింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరే నేతలకు పదవులు కట్టబెడుతోంది. మరి లోక్ సభ ఎన్నికల తరువాత తెలంగాణలో రాజకీయాలు ఎలా మారుతాయో వేచి చూడాలి.