Salaar Movie: 'సలార్' ఖాతాలో మరో రికార్డ్..దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్స్‎లో ఉత్తమ చిత్రంగా ఎంపిక..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 800కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

Salaar Movie: 'సలార్' ఖాతాలో మరో రికార్డ్..దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్స్‎లో  ఉత్తమ చిత్రంగా ఎంపిక..!!
New Update

Salaar Movie - Dadasaheb Phalke Award: పాన్ ఇండియా సార్ట్ ప్రభాస్ (Prabhas) నటించిన తాజా మూవీ సలార్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసింది. భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 800కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన ఘనత లభించింది. ఇండియన్ సినీ చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెసివల్ 2024లో ఉత్తమ చిత్రంగా సెలక్ట్ అయ్యింది. ఈ విషయాన్ని దాదా సాహెబ్ ఫాల్కే నిర్వాహకుల కమిటీ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

ఇలాంటి ఒక ఇతిహాసకావ్యం తీసిన గొప్ప టీంకు మా అభినందనలు. మీ ఊహల నుంచి తెర మీది వరకు ఈ ప్రయాణం మీ సమర్థతకు నిదర్శనం అంటూ దాదా సాహెబ్ ఫాల్కే టీమ్ ట్విట్టర్ లో రాసింది. కాగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు సంబంధించిన అవార్డుల కార్యక్రమం గత మంగళవారం ముంబైలో (Mumbai) ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

భారత సినీ ప్రముఖులతోపాటు ఎంతో మంది బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఇక ఈ అవార్డులో గతేడాది రిలీజ్ అయిన జవాన్, యానిమల్ చిత్రాలు పోటీ పడ్డాయి. జవాన్ లో షారుఖ్ ఖాన్ నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ నయనతారకు ఉత్తమ నటి అవార్డు లభించింది. గతేడాది యానిమల్ సినిమాతో పైసల వర్షం కురిపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బెస్ట్ డైరెక్టర్ గా నిలిచారు.

ఇది కూడా చదవండి: విద్యార్థులకు అలర్ట్.. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ రిలీజ్..ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..!

#prabhas #dadasaheb-phalke-awards-2024 #prashanth-neel #salaar-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe