/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-19-1-jpg.webp)
Salaar Movie - Dadasaheb Phalke Award: పాన్ ఇండియా సార్ట్ ప్రభాస్ (Prabhas) నటించిన తాజా మూవీ సలార్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసింది. భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 800కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన ఘనత లభించింది. ఇండియన్ సినీ చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెసివల్ 2024లో ఉత్తమ చిత్రంగా సెలక్ట్ అయ్యింది. ఈ విషయాన్ని దాదా సాహెబ్ ఫాల్కే నిర్వాహకుల కమిటీ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
Salaar: Part 1 - Ceasefire wins the prestigious Film of the Year Award at DPIFF 2024! A cinematic masterpiece that has redefined storytelling, captivated audiences, and now, etched its name in history.
Congratulations to the visionary team behind this epic saga. Your journey… pic.twitter.com/QeeaChEu7t
— Dadasaheb Phalke International Film Festival (@Dpiff_official) February 23, 2024
ఇలాంటి ఒక ఇతిహాసకావ్యం తీసిన గొప్ప టీంకు మా అభినందనలు. మీ ఊహల నుంచి తెర మీది వరకు ఈ ప్రయాణం మీ సమర్థతకు నిదర్శనం అంటూ దాదా సాహెబ్ ఫాల్కే టీమ్ ట్విట్టర్ లో రాసింది. కాగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు సంబంధించిన అవార్డుల కార్యక్రమం గత మంగళవారం ముంబైలో (Mumbai) ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
భారత సినీ ప్రముఖులతోపాటు ఎంతో మంది బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఇక ఈ అవార్డులో గతేడాది రిలీజ్ అయిన జవాన్, యానిమల్ చిత్రాలు పోటీ పడ్డాయి. జవాన్ లో షారుఖ్ ఖాన్ నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ నయనతారకు ఉత్తమ నటి అవార్డు లభించింది. గతేడాది యానిమల్ సినిమాతో పైసల వర్షం కురిపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బెస్ట్ డైరెక్టర్ గా నిలిచారు.