Kalki 2898AD : 'కల్కి' ఖాతాలో మరో రికార్డు.. ఒకే థియేటర్ లో 42 షోలు, ప్రభాస్ క్రేజ్ కు ఇదే నిదర్శనం!

తెలుగు రాష్ట్రాల్లో 'కల్కి' క్రేజ్ పీక్స్ కు చేరింది. తాజాగా ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కొత్తగా ఓపెన్ చేసిన 'అపర్ణ సినిమాస్‌' మల్టీప్లెక్స్‌ 'కల్కి' కోసం ఓపెనింగ్ డేనే 42 షోలు ఏర్పాటు చేసింది. ఈ అన్ని షోలకు టికెట్లు అమ్ముడుపోవడం విశేషం.

Kalki 2898AD : 'కల్కి' ఖాతాలో మరో రికార్డు.. ఒకే థియేటర్ లో 42 షోలు, ప్రభాస్ క్రేజ్ కు ఇదే నిదర్శనం!
New Update

Another Rare Record For Kalki 2898AD Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'కల్కి 2898AD' మూవీ రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. జూన్ 27 రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఓవర్సీస్ తో పాటూ ఇండియాలోనూ కల్కి టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కల్కి క్రేజ్ పీక్స్ కు చేరింది. ముఖ్యంగా తెలంగాణలో ఈ సినిమా ఎర్లీ మార్నింగ్ షోస్ తో రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో చాలా వరకు మల్టీప్లెక్స్‌ ఎక్కువ మొత్తంలో షోలు రన్ చేయబోతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా కోసం ఒకే థియేటర్ లో ఏకంగా 42 షోలు వేయబోతున్నారట. హైదరాబాద్ లో కొత్తగా ఓపెన్ చేసిన 'అపర్ణ సినిమాస్‌' మల్టీప్లెక్స్‌ 'కల్కి' కోసం ఓపెనింగ్ డేనే 42 షోలు ఏర్పాటు చేసింది. ఈ అన్ని షోలకు టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. ఇప్పటి వరకు మరే స్టార్ హీరో సినిమాని ఒకే మల్టిప్లెక్స్ లో ఎన్ని షోలు ఏర్పాటు చేసిన దాఖలాలే లేవు.

Also Read : ‘వకీల్ సాబ్’ నటికి బెదిరింపులు.. వీడియోతో సహా బయటపెట్టిన పవన్ హీరోయిన్!

ఈ అరుదైన ఘనత ప్రభాస్ 'కల్కి' కి మాత్రమే దక్కింది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఏ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసాడు. వైజయంతీ మూవీస్‌ సుమారు 700 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.

#kalki-2898-ad #prabhas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి