Brahmanandam : ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం(Brahmanandam) కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయనను ఎన్నో అవార్డులు వరించాయి. ఇప్పటికీ 67 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీపడుతూ తనదైన శైలిలో వెండితెరపై ఉర్రూతలూగిస్తు్న్న బ్రహ్మీకి తాజాగా మరో అవార్డు లభించింది.
ఈ మేరకు ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ 'రాగా సప్తస్వరం' ('Raga Sapthaswaram') 35వ వార్షికోత్సవం రవీంద్రభారతీ(Ravindra Bharathi) లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), నటుడు మురళీమోహన్(Murali Mohan), ఎంపీ రఘు రామ కృష్ణ(Raghu Rama Raju) రాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం.. బ్రహ్మానందానికి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణకంకణాన్ని మంత్రి ప్రదానం చేశారు. అలాగే ప్రముఖ నాట్య గురువు జమైకా ట్రేడ్ కమిషనర్ వింజమూరి సుజాతను అవార్డుతో సత్కారించారు. ఈ ఈవెంట్ లో టర్కీ కన్సలేట్ జనరల్ యల్మన్ ఒకన్, ఐటో ప్రెసిడెంట్ డాక్టర్ అసఫ్ ఈక్బాల్, సంస్థ సభ్యులు రాజ్య లక్ష్మీ, కె.అహల్య, గీత రచయిత్రి సుందరవల్లి శ్రీదేవి, నాట్య గురువు సుజాత వింజమూరి, తదితరులు పాల్గొని సందడి చేశారు. ఇక గౌరవం దక్కడంపై బ్రహ్మానందం అనందం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి : Back Pain: పురుషుల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా నడుం నొప్పి.. ఎందుకో తెలుసా?
ఇక కన్నెగంటి బ్రహ్మానందం.. రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నటించిన 'ఆహనా పెళ్ళంట' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. వివిధ భాషల్లో ఇప్పటికీ 1250కి పైగా సినిమాల్లో నటించిన హాస్యబ్రహ్మ 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఆయన.. ఉత్తమ హాస్య నటుడిగా 5 నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు. 2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది.