WhatsApp New Feature: మనల్ని కాపాడేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్..అయితే వాళ్లకు మాత్రమే ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్లు భాగమైపోయ్యాయి. అవసరానికి ఏమున్నా.. లేకున్నా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అనేంతగా చాలామంచి ఉన్నారు. అంతేకాదు అనేక మంది దానికి అతుక్కునిపోయిన్నారు. By Vijaya Nimma 07 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి WhatsApp New Feature: విలువైన డేటాను అందులోనే ఫోన్లలో భద్రపరుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీ స్మార్ట్ ఫోన్ సేఫ్టీ కోసం.. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. అంతేకాకుండా అగంతకుల నుంచి వచ్చే ఫోన్ల నుంచి యూజర్లను కాపాడేలా ఐపీ అడ్రస్‌ను ఈ ఫీచర్ సురక్షితంగా ఉంచుతుంది. మీ సెల్ ఫోన్‌కు ఎప్పుడూ లాక్ ఉన్నా, కీప్యాడ్ లాక్, పిన్ లేదా పాస్వర్డ్‌ను పెట్టుకోని భద్రంగా ఉంచుకోకున్న జరిగే అర్థాలు జరుగుతునే ఉన్నాయి. అలాంటి సమస్సలు జరగకుండా కొత్త ఫీచర్స్ వచ్చాయి. ఐపీ అడ్రస్‌లకు రక్షణ కవచంలా అయితే ఈ వాట్సాప్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందించే వాబీటా ఇన్ఫో ఈ ఫీచర్‌ను గుర్తు పటింది. ప్రస్తుతం.. అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాట్సప్‌లో ఎబుల్, డిసేబుల్ ఫీచర్‌లను ఎంపిక చేసుకోవడం ద్వారా యూజర్ల ఐపీ అడ్రస్‌లకు రక్షణ కవచంలా ఉంటుంది. నిపుణుల నివేదిక ప్రకారం.. యూజర్లు వాట్సప్‌లో వాయిస్స్, వీడియో కాల్స్ చేసే టైంలో సురక్షితంగా ఉండేలా ప్రైవసీ సెట్టింగ్ స్క్రీన్‌లో అడ్వాన్డ్స్ అనే సెక్షన్‌లో ‘ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ ప్రారంభించుకోవాలి. తద్వారా, ఇతరులు మీరు ఫోన్ మాట్లాడే టైంలో మీరు ఎక్కడ నుంచి ఫోన్ మాట్లాడుతున్నారు..? ఐపీ అడ్రస్ ఏంటనేది..? తెలుసుకునే అవకాశం ఉండదు. వాట్సప్ మరో ఫీచర్ స్మార్ట్ ఫోన్ వినియోగించేటప్పుడు తీసుకోవాల్సిన భద్రతా పరమైన నియమాలు తెలుసుకోవాలి. అయితే.. ఛానెల్ అప్‌డేట్‌ల కోసం రియాక్షన్‌లను ఫిల్టర్ చేసేలా వాట్సప్ మరో ఫీచర్‌ను విడుదల చేయనుంది. కాంటాక్ట్‌లలో ఎవరైనా ఎమోజీని ఉపయోగించి కంటెంట్‌కి ప్రతిస్పందించినట్లయితే వెంటనే గుర్తించడానికి ఛానెల్ యజమానులకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఇప్పుడు కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. విలువైన డేటాను అందులోనే భద్రపరుస్తున్నారని వాబీటా తెలిపింది. ఇంకేందుకు ఆలస్యం మీ స్మార్ట్ ఫోన్ సేఫ్టీ కోసం ఇవి ఫాలో అవ్వండి. ఇది కూడా చదవండి: ఏ వంట నూనె మంచిదో ఇలా సులువుగా తెలుసుకోండి #whatsapp #messaging-app #ew-feature మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి