Hyderabad : నగరంలో మరో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం!

హైదరాబాద్‌ లో మరో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మిస్తామని..దాని నిర్మాణానికి బీసీసీఐని ఒప్పించినట్లు సీఎం రేవంత్‌ ప్రకటించారు. కొద్దిరోజుల్లోనే భూమిని కేటాయిస్తామని, హైదరాబాద్​లోని బ్యాగరి కంచెలో ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి సమీపంలోనే ఈ స్టేడియం నిర్మాణం చేపడుతామని తెలిపారు.

New Update
CM Revanth Reddy: తెలంగాణకు కొత్త గవర్నర్.. సీఎం రేవంత్ ఏమన్నారంటే!

Telangana : హైదరాబాద్‌ (Hyderabad) లో మరో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియాన్ని (International Cricket Stadium) నిర్మిస్తామని.. దాని నిర్మాణానికి బీసీసీఐ (BCCI) ని ఒప్పించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొద్దిరోజుల్లోనే భూమిని కేటాయిస్తామని, హైదరాబాద్​లోని బ్యాగరి కంచెలో ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి సమీపంలోనే ఈ స్టేడియం నిర్మాణం చేపడుతామని తెలిపారు.

త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకుని వస్తామని తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించుకుందని, అందుకే క్రీడల కోసం ప్రత్యేకంగా తాజా బడ్జెట్‌‌‌‌లో రూ. 321 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ సిరాజ్‌‌‌‌కు డీఎస్పీ ఉద్యోగాలకు ఉద్దేశించిన బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం రేవంత్‌ (CM Revanth Reddy) మాట్లాడారు.

హర్యానా, పంజాబ్​ సహా వివిధ రాష్ట్రాల స్పోర్ట్స్​ పాలసీలను అధ్యయనం చేసి, రాష్ట్రంలో బెస్ట్ పాలసీని తీసుకొస్తామని తెలిపారు. ‘‘వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పోర్ట్స్ పాలసీని చర్చకు పెడతామన్నారు. ఇందుకు ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని సీఎం తెలిపారు. వ్యసనాల నుంచి యువతను బయటకు తీసుకువచ్చేందుకు క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేవంత్‌ వెల్లడించారు. ప్రపంచంలో ఏ క్రీడలు జరిగినా తెలంగాణలో రాష్ట్రం నుంచి శిక్షణ పొందిన క్రీడాకారులు పతకాలు ​ తీసుకువచ్చే విధంగా రూపొందించే విధివిధానాలకు అందరి మద్దతు ఉండాలని ఆయన అన్నారు.

Also read:  మీరు ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే!

Advertisment
తాజా కథనాలు