హైదరాబాద్‌కు మరో పరిశ్రమ

రాష్ట్రంలో మరో సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. యూఏఈకి చెందిన నాఫ్కో సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

హైదరాబాద్‌కు మరో పరిశ్రమ
New Update

రాష్ట్రంలో మరో సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. యూఏఈకి చెందిన నాఫ్కో సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి మంత్రి కేటీఆర్‌ నాఫ్కో సంస్థకు చెందిన ప్రతినిధులతో భేటీ అయ్యారు. సంస్థకు చెందిన ప్రతినిధుల టీమ్‌తో సమావేశం అనంతరం పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు మార్చుకున్నారు. నాఫ్కో సంస్థ అగ్ని ప్రమాదాల నిరవారణకు ఉపయోగించే సామాగ్రిని తయారు చేయడంలో ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా ఉంది. యూఏఈకి చెందిన ఈ దిగ్గజ సంస్థ అగ్ని ప్రమాదాల నివారణ యంత్రాలను తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది.

ఇప్పుడు ఈ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో సుమారు 700 కోట్ల రూపాయలతో నాఫ్కో సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ తన కంపెనీని స్థాపంచడంతో పాటు తెలంగాణలోని నేషనల్ అకాడమీ కలిసి ఇంటర్నేషనల్‌ లెవల్‌ ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ నాఫ్కో సంస్ధ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. దాదాపు 100కు పైగా దేశాలకు అగ్ని ప్రమాద యంత్రాలను ఎగుమతి చేస్తున్న ఈ సంస్థ.. తెలంగాణలోని హైదారాబాద్‌కు రావడం గొప్ప విషయమన్నారు. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు అవుతుందన్నారు.

ఈ సందర్భంగా నాఫ్కో సంస్థ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్ మాట్లాడుతూ.. భారత్‌లో తమ కార్యకలాపాలు ఏర్పాటు చేసుకోబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇండియా ఉందని, అలాంటి దేశంలో తమ సంస్ధ పెట్టుడులు పెట్టేందుకు ఉత్సహం చూపిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో తమ కార్యకాలాపాలు సుస్థరం చేసుకున్న అనంతరం ఆసియా ఖండంలోని ఇతర దేశాల్లో మరిన్ని బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తామని నాఫ్కో సంస్థ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్ వెల్లడించారు.

#hyderabad #investment #uae #nafco
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe