గత కొన్నాళ్లుగా తిరుమలలో చిరుతల సంచారం భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. ఈ మధ్యే ఓ చిరుత చిక్కింది. తాజాగా నేడు ఉదయం మరో చిరుత బోనులో చిక్కింది. నామాలగవి దగ్గర చిరుతను బంధించినట్లు అధికారులు తెలిపారు. కాగా రెండు నెలల్లో మూడు చిరుతలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.
పూర్తిగా చదవండి..Tirumala : తిరుమల కొండపై బోనులో చిక్కిన మరో చిరుత…!!
తిరుమల అలిపిరి నడకమార్గంలో మరో చిరుత బోనులో చిక్కింది. నరసింహస్వామి ఆలయానికి సమీపంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో నిన్న అర్థరాత్రి చిరుత చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. బాలిక లక్షిత పై దాడి చేసిన పరిసరాల్లో ఇటీవల ఓ చిరుతను పట్టుకొని జూ కు తరలించారు ఫారెస్టు అధికారులు. కొన్నిరోజుల వ్యవధిలోనే రెండో చిరుత బోనులో చిక్కుకోవడంతో ఉపశమనం లభించినట్లయ్యింది.
Translate this News: