Tirumala : తిరుమల కొండపై బోనులో చిక్కిన మరో చిరుత...!!

తిరుమల అలిపిరి నడకమార్గంలో మరో చిరుత బోనులో చిక్కింది. నరసింహస్వామి ఆలయానికి సమీపంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో నిన్న అర్థరాత్రి చిరుత చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. బాలిక లక్షిత పై దాడి చేసిన పరిసరాల్లో ఇటీవల ఓ చిరుతను పట్టుకొని జూ కు తరలించారు ఫారెస్టు అధికారులు. కొన్నిరోజుల వ్యవధిలోనే రెండో చిరుత బోనులో చిక్కుకోవడంతో ఉపశమనం లభించినట్లయ్యింది.

New Update
Tirumala : తిరుమల కొండపై బోనులో చిక్కిన మరో చిరుత...!!

గత కొన్నాళ్లుగా తిరుమలలో చిరుతల సంచారం భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. ఈ మధ్యే ఓ చిరుత చిక్కింది. తాజాగా నేడు ఉదయం మరో చిరుత బోనులో చిక్కింది. నామాలగవి దగ్గర చిరుతను బంధించినట్లు అధికారులు తెలిపారు. కాగా రెండు నెలల్లో మూడు చిరుతలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.

తిరుమలలో మరో బోనులో చిక్కింది. తాజాగా ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో చిరుత బోనులో చిక్కినట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల క్రితం బోనులో చిక్కిన చిరుతకు సమీపంలోనే ఈ చిరుత చిక్కింది. చిరుతను బంధించేందుకు అధికారులు మూడు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. మోకాలి మిట్ట, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు దగ్గర బోనులు ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర బోనులో చిరుత చిక్ింది. దీంతో కొన్నిరోజుల వ్యవధిలోనే మూడు చిరుతలను ఫారెస్టు అధికారులు బంధించారు. బాలిక లక్షితపై దాడి చేసిన పరిసరాల్లోనే ఇటీవలే ఓ చిరుతను పట్టుకున్న అధికారులు జూకు తరలించారు. ఇప్పుడు మరో చిరుత చిక్కడంతో తిరుమల శ్రీవారం భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు