Tripti Dimri: 'బాబీ-2' దొరికిందా భయ్యా..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో యానిమల్ బజ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ సరసన జోయా పాత్రలో నటించిన త్రిప్తి కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన 'బాబీ 2' అంటూ త్రిప్తి పేరే వినిపిస్తోంది.

New Update
Tripti Dimri:  'బాబీ-2' దొరికిందా భయ్యా..?

Babi 2 Tripti Dimri : అర్జున్ రెడ్డి ఫెమ్ సందీప్ వంగ (Sandeep Vanga)దర్శకత్వంలో విడుదలైన చిత్రం 'యానిమల్' (Animal). ప్రస్తుతం సోషల్ మీడియాలో యానిమల్ బజ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ డిఫరెంట్ పాత్రల్లో కనిపించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. డిసెంబర్ 1 న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 315 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచన. రణబీర్ హీరోగా , రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో జోయా పాత్రలో కనిపించిన జోయా.. రణబీర్ సరసన ఇంటిమేట్ సీన్స్ లో నటించింది.

publive-image

Also Read: Daggubati Abhiram Wedding: శ్రీలంకలో ఘనంగా.. దగ్గుబాటి అభిరామ్ డెస్టినేషన్ వెడ్డింగ్..!

'యానిమల్' తర్వాత ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. నెటిజన్లు సందీప్ వంగ చిత్రాల్లో 1st హీరోయిన్ కంటే 2nd హీరోయిన్ బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక కంటే త్రిప్తి కి ఎక్కువ క్రేజ్ వచ్చింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బాబీ 2 అంటూ త్రిప్తి (Tripti)పేరే వినిపిస్తోంది. ఫ్యాన్స్ ఈ బ్యూటీ కోసం నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. యానిమల్ సినిమాకు ముందు ఏ సినిమాల్లో నటించింది.. ఇప్పటివరకు త్రిప్తి నటించిన సినిమాలేంటి అని వెతికి మరీ తెలుసుకుంటున్నారు. ఇక 'యానిమల్' త్రిప్తి స్టార్ అయ్యిందనే చెప్పొచ్చు. మరి ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయా లేదా అనేది చూడాలి.

publive-image

Also Read: NetFlix CEO: మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో..! ఫొటోలు వైరల్‌!

Advertisment
తాజా కథనాలు