ఎన్నికల కంటే సినిమా ముఖ్యమైపోయిందా..ఏంటి రా ఈ దారుణం?

నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇవాళ యానిమల్ సినిమా రిలీజ్ అయింది. హైదరాబాద్ లో పోలింగ్ శాతం కేవలం 31 మాత్రమే ఉంటే యానిమల్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం 80 శాతానికి చేరుకుంది. దీంతో ఎన్నికల కంటే సినిమాలే ముఖ్యమయ్యాయా...ఏంటీ దారుణం అంటున్నారు.

ఎన్నికల కంటే సినిమా ముఖ్యమైపోయిందా..ఏంటి రా ఈ దారుణం?
New Update

Animal Movie Bookings: అరే ఏం మనుషులు రా భాయ్ అంటున్నారు అందరూ హైదరాబాద్ వాసులను చూసి. అసలు ఒక దేశంలో, ఒక సమాజంలోనే బతుకుతున్నారా అంటూ మండిపడుతున్నారు. ఒక దేశ పౌరుడిగామరీ ఇంత బాధ్యత లేకుండా ఎలా ఉన్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే...నిన్న నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections) జరిగాయి. ఏ దేశ పౌరుడికి అయినా ఓటు వేయడం అనేది ఒక బాధ్యత. కానీ హైదరాబాద్ వాసులు దీన్ని పూర్తిగా మర్చిపోయారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం ఉదయాన్నే క్యూల్లో నిలబడి, వెయిట్ చేసి మరీ ఓట్లు వేశారు కానీ హైదరాబాద్ వాసులు మాత్రం ఇల్లు కదల్లేదు. మొత్తం తెలంగాణలోనే హైదరాబాద్ లో అత్యంత తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చును. దానికి తోడు పోలింగ్ గురువారం రోజు పడింది వెంటనే శుక్రవారం.. తరువాత శని ఆది వారాలు వచ్చాయి. వారాంతపు సెలవులు రెండిటికి ఒకరోజు ముందు ఎన్నికల పండగ సెలవు వచ్చింది. ఇంకేముంది.. శుక్రవారం సెలవు పెట్టేసి చాలామంది తమ తమ సొంత ఊళ్లకు చెక్కేశారు. హైదరాబాద్ బలం అంతా బయట నుంచి వచ్చి సెటిల్ అయినా సిటిజన్స్ అని మరోసారి రుజువు అయింది. పోలింగ్ బూత్ లు ఖాళీగా మిగిలిపోయాయి.

Also Read: నాగార్జునసాగర్ దగ్గర కొనసాగుతున్న హైటెన్షన్..అసలు దీని వెనుక కథేంటి?

అయితే ఇన్ని లెక్కలు, ఈ బద్ధకాలూ అన్నీ కేవలం ఓటు వేయడానికి మాత్రమే...సినిమాలకు కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా యానిమల్ సినిమా విడుదల అయింది. హైదరాబాద్ లో దీని కోసం అడ్వన్స్ బుకింగ్ చేసుకున్నారు. అది కూడా 80 శాతం బుకింగ్స్ అయ్యాయి. పోలింగ్ తో చూస్తే మూడురెట్లు ఎక్కువగా టికెట్లు బుక్ అయ్యాయి. దీంతో దీని మీద తెగ మీమ్స్ వస్తున్నాయి. ఇవి చాలా వైరల్ అవుతున్నాయి.

ఇక యానిమల్ సినిమా విషయానికొస్తే, అడ్వాన్స్ బుకింగ్స్ (Advance Bookings) విషయంలో ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పేరుకే హిందీ సినిమా కానీ, నార్త్ కంటే తెలుగు రాష్ట్రాల్లోనే మూవీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక హైదరాబాదులో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 3 కోట్ల 20 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. సుమారు 555 షోలకు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తే 400 షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.

Also Read: జనాలను వెర్రోళ్ళను చేస్తున్న ఎగ్జిట్‌ పోల్స్.. తలా తోక లేకుండా లెక్కలు!

దీన్నిబట్టి హైద్రాబాద్ లో యానిమల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది. అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) , రష్మిక మందన జంటగా నటించిన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. దీంతో ఇండియా వైడ్1 గా ఉన్న సినీ లవర్స్ యానిమల్ మూవీని చూసేందుకు థియేటర్స్ లో క్యూ కడుతున్నారు.

#telangana-elections-2023 #animal #polling #animal-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe