Popular YouTuber Abhradeep Saha Passed Away: యూట్యూబర్ 'యాంగ్రీ రాంట్‌మాన్'గా (Angry Rantman) పాపులర్ అయిన అబ్రదీప్ సాహా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్పోర్ట్స్ వార్తలు, విశ్లేషణలు చేస్తూ భారీ పాపులర్ అయిన ఈ యువకుడి డెత్ కు సంబంధించిన సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అతున్నాయి. అబ్రదీప్ అనారోగ్యంతో కన్నుమూసినట్లు సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతని కుటుంబం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం విశేషం. కాగా దీనిపై ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు.
మంగళవారం రాత్రి మరణించినట్లు..
ఈ మేరకు ఓ ట్విట్టర్ యూజర్ @raj4_ssr పోస్ట్ ప్రకారం.. సాహా మంగళవారం రాత్రి మరణించినట్లు పేర్కొన్నారు. 'బరువైన హృదయంతో.. నేను అబ్రదీప్ సాహా లేదా యాంగ్రీ రాంట్‌మాన్ ఇక లేడని చెప్పాలి. మీ అందరికీ తెలిసిన అతను గతరాత్రి మరణించాడు. ప్రస్తుతానికి మాటలు రావట్లేదు. అతను అందరి ముఖాల్లోకి తీసుకురాగలిగిన ఆనందపు జ్ఞాపకాలు మిస్ అవుతాము' అంటూ రాసుకొచ్చాడు. మరొకరు 'అతని స్కూల్ క్లాస్‌మేట్ నుంచి నాకు సమాచారం అందింది. ఆయన నిజంగానే చనిపోయారు. మేము 10వ తరగతి వరకు ఒకే పాఠశాలలో చదువుకున్నాం' అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
చివరి వీడియో మార్చి 8న..
ఏప్రిల్ 16న తోటి యూట్యూబర్ నియాన్ మ్యాన్ షార్ట్స్.. సాహా కొన్ని రోజుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోబోతున్నాడని చెప్పాడు. అయితే పోస్ట్ తర్వాత అతని ఆరోగ్యంపై ఎటువంటి అప్‌డేట్ రాలేదు. సాహా ఆరోగ్యం క్షీణించిందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చాయని ఏప్రిల్ 15న యూట్యూబర్ నియాన్ మ్యాన్ షార్ట్ చెప్పారు. 4.81 లక్షల మంది సబ్ స్ర్కైబర్‌లను కలిగి ఉన్న సాహా.. యూట్యూబ్ ఛానెల్ యాంగ్రీ రాంట్‌మన్‌ను శీఘ్రంగా పరిశీలిస్తే అతని చివరి వీడియో మార్చి 8న పోస్ట్ చేయబడింది. వీడియోలో అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతికల గురించి ప్రస్తావించారు.
Also Read: సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటిన రైతుకూలీ కొడుకు..!
ఆవేశంగా రివ్యూస్..
కొత్త కొత్త సినిమాలు చూసి వాటికి ఆవేశంగా రివ్యూస్ ఇస్తుంటాడు. ఇతడి వీడియోలు చాలా ఫన్నీ తెప్పించడమే కాదూ.. ఎంటర్ టైన్ చేస్తుంటాయి. అతడు కేవలం యూట్యూబర్ మాత్రమే కాదు.. ఇన్ స్టా వేదికగా కూడా పలు అంశాలపై తన ఆవేశాన్ని వెల్లగక్కుతూ ఉంటాడు. ఇన్ స్టాలో కూడా ఆయనకు లక్ష మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నవ్వుతూ, కోపంగా, ఆవేశంగా, చెమటలు పట్టే విధంగా అన్ని సామాజిక అంశాలపై స్పందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్యుయెన్సర్ ఇక లేరని తెలిసే సరికి ఆయన ఫాలోవర్స్, నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆయన చివరి సారిగా సైతాన్ మూవీకి రివ్యూ ఇచ్చారు.