Ongole : పాదయాత్రలో సీఎం జగన్(CM Jagan) తమకు ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలు చేయాల్సిందేనని అంగన్‌వాడీలు ఆందోళన చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా సమ్మె బాట పట్టిన అంగన్ వాడీల ఆందోళన కొనసాగుతునే ఉంది. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ ఇంకా ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు తీర్చేవరకూ తగ్గేదేలేదని తేల్చి చెబుతున్నారు.
Also read: తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం ప్రత్యేకత ఏంటో తెలుసా.?
ప్రకాశం జిల్లా(Prakasam District) అంతటా సమ్మె బాట పట్టారు అంగన్ వాడీ వర్కర్ల. ఒంగోలు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు పలికారు టీడీపీ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్. ఆయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ అంగన్ వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వందలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టనట్టుగా వ్యవహారిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ‘పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంది’.. యువగళం పాదయాత్రపై వైసీపీ నేత కౌంటర్లు.!
అంగన్ వాడీ వర్కర్లు మూడు రోజులుగా సమ్మె చేస్తున్నా వారి వద్దకు వచ్చి మాట్లాడటానికి కూడా సైకో ముఖ్యమంత్రికి తీరిక లేదనని ధ్వజమెత్తారు. ప్రజలకు వారు చేస్తోన్న సేవలకు తగ్గట్టు జీతం పెంచాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని అంగన్ వాడీ వర్కర్లు ధర్నా నిర్వహిస్తున్నారని..వారి డిమాండ్లలో న్యాయం ఉందని వ్యాఖ్యనించారు. టీడీపీ పార్టీ అంగన్ వాడీ వర్కర్ల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తోందని ప్రకటించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడిపోతారని విమర్శలు గుప్పించారు. టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్ వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.