గత కొద్ది రోజులుగా ఏపీలో తమ సమస్యల పరిష్కారించాలంటూ అంగన్వాడీ వర్కర్లు (Anganwadi workers) , హెల్పర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇంటి ముందు బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ క్రమంలోనే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఇంటి వద్ద ఐఏఎఫ్టీయూ, సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ సంఘాల నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద లేరని చెన్నై వెళ్లారని పోలీసులు చెప్పినప్పటికీ కూడా వారు రోడ్డు పై కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో సమాచారం అందుకునన ఎమ్మెల్యే భూమన తిరుపతి ఆయన నివాసం వద్దకు చేరుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పెద్దలకు సమస్యను వివరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అంగన్వాడీ లను తన ఇంటిలోకి ఆహ్వానించి తేనీరు ఇచ్చారు. జీతాలు పెంచేంతవరకు, గ్రాట్యూటి ఇచ్చేంతవరకు సమ్మె ఆగదుఅంగన్వాడీ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఇంటి ముందు కూడా అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. తన ఇంటి ముందు ధర్నా చేస్తున్న మహిళలతో అక్క ఇంట్లోకి రండి అని సాధారంగా ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే. ఇంట్లోకి పిలిచి వారి సాధక బాధకాలు విన్న ఎమ్మెల్యే రాచమల్లు.
ఈ క్రమంలోనే అంగ్వాడీ, ఆశావర్కర్లు, మున్సిపల్ ఉద్యోగుల జీతాలు పెంచే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు.
సీఎం జిల్లా పర్యటనలో ఈ విషయం గురించి చర్చించినట్లు ఆయన వారికి వివరించారు. జీతాలు పెంచే విషయంలో సీఎం జగన్ సుముఖతతో ఉన్నారని వివరించారు.
సమస్యల పరిష్కారం విషయంలో ఆలస్యం అయింది. దీనిపై సీఎం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి బొత్సా , సజ్జల ఈ విషయంపై స్పందించారని ఆయన తెలిపారు. జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు.జీతాలు పెంచే విషయంలో సర్గుబాటు జరుగుతుందని పేర్కొన్నారు.
జీతాలు పెంచలేమని ప్రభుత్వం అనలేదు.. ఇప్పుడు వచ్చే జీతాలు సరిపోతాయని మేము అనలేదు.. మీ మనస్సును తృప్తిపరిచే విధంగా జీతాలు పెంచడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. టీడీపీ హయాంలో అంగన్ వాడీ ఉద్యోగులను ధర్నా చేస్తున్నారని గుర్రాలతో తొక్కించి జడలు పట్టి లాగినప్పుడు నా మనసు ఎంతో ఆవేదన చెందిందని పేర్కొన్నారు.
ఆనాడు మా ఇంటి ఆడపడుచులకు అన్యాయం జరుగిందని భాదపడ్డాను. నా ఇంటి ఆడపడుచులు అనుకునే అంగన్ వాడీ ఆయాలకు , టీచర్లకు చీర సారె పంచాను అంటూ ఎమ్మెల్యే వివరించారు. మిమ్మల్ని రోడ్డుపై కూర్చోబెట్టడానికి మా మనస్సు ఎంతో కలత చెందుతుంది.
నా నియోజకవర్గంలో అంగన్వవాడీ వర్కర్లు రిటైర్ అయితే నా సొంత ఖర్చులతో రెండు లక్షలు ఇవ్వడానికి నేను సిద్దపడ్డాను అంటూ ఎమ్మెల్యే రాచమల్లు వివరించారు.
Also read: ఇంగ్లీష్ నేమ్‌బోర్డులు కనిపిస్తే షాపులపై దాడి.. బెంగళూరులో లాంగ్వేజ్ వార్!