Anganvadi Arrests: అంగన్వాడీ దీక్షా శిబిరం పై విరుచుకుపడ్డ పోలీసులు...దొరికిన వారిని దొరికినట్లు లాగిపడేశారు!

అంగన్‌ వాడీ సిబ్బంది ఆందోళనల్లో భాగంగా చలో విజయవాడకు పిలుపునివ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విజయవాడకు తరలి వచ్చిన మహిళల్ని పోలీసులు ఆదివారం అర్థరాత్రి అదుపులోనికి తీసుకున్నారు.

Anganvadi Arrests: అంగన్వాడీ దీక్షా శిబిరం పై విరుచుకుపడ్డ పోలీసులు...దొరికిన వారిని దొరికినట్లు లాగిపడేశారు!
New Update

Anganwadi Arrests: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ అంగన్వాడీ (Anganwadi)  సిబ్బంది చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం పై పోలీసులు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గత 41 రోజులుగా అంగన్వాడీ సిబ్బంది దీక్షలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను ఏపీ సీఎం జగన్ కు అందించేందుకు తరలిరావాలంటూ అంగన్వాడీ ప్రతినిధులు రెండు రోజుల క్రితం '' చలో విజయవాడ'' కు పిలుపునిచ్చారు.

నిద్రిస్తున్న అంగన్వాడీ సిబ్బందిని..

ఈ క్రమంలోనే విజయవాడకు భారీ సంఖ్యలో తరలివచ్చిన సిబ్బందిని పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్‌ చేశారు. తెల్లవారుజామున విజయవాడ ధర్నా చౌక్‌ లో నిద్రిస్తున్న అంగన్వాడీ సిబ్బందిని బలవంతంగా అరెస్ట్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు. సోమవారం చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలు పిలుపునివ్వడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఆదివారం రాత్రే విజయవాడకు చేరుకున్నారు.

లైట్లు ఆపేసి మరీ...

ఈ క్రమంలో అంగన్వాడీల ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు అర్థరాత్రి 3 గంటల ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తల్ని అరెస్ట్‌ చేశారు. వందల మంది అంగన్వాడీ సిబ్బందిని అదుపులోనికి తీసుకున్నారు. ధర్నా చౌక్ సమీపంలో లైట్లు ఆపేసి మరీ మహిళల పై దాడులకు దిగారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. విజయవాడ డీసీపీ విశాల్‌ గున్నీ ఆదేశాలతో ఫోటో గ్రాఫర్లు, కెమెరామెన్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెనక్కి తగ్గేది లేదని..

దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వారిని విడిచిపెట్టారు. మహిళా సిబ్బందిని ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లోని పలు పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇప్పటికే పోలీసులు విజయవాడ బస్టాండ్‌, రైల్వే స్టేషనల్లో సమీపంలో పెద్ద ఎత్తున మోహరించారు. ఆందోళన కార్యక్రమానికి తరలివస్తున్న సిబ్బందిని ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు. అరెస్ట్‌లు చేసిన వెనక్కి తగ్గేది లేదని అంగన్వాడీ సిబ్బంది చెబుతున్నారు.

తమను ఉద్యోగాల్లో నుంచి తీసివేస్తారో..ప్రభుత్వాన్ని తాము గద్దె దించుతామో మరో మూడు నెలల్లో తేలిపోతుందని అంగన్‌ వాడీలు చెబుతున్నారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్నప్పటికీ కూడా అర్థరాత్రి పూట అరెస్ట్‌ చేశారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా, అరెస్టులు చేసినా, ఉద్యోగాల నుంచి తొలగించినా కూడా వెనక్కి తగ్గేది లేదని వారు చెబుతున్నారు.

అంగన్‌ వాడీలను తక్షణమే విడుదల చేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆందోళనలు చేస్తున్న అంగన్‌వాడీలకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.

Also read: అంబానీ ఇంటి పై ”జై శ్రీరామ్‌” వెలుగులు..!

#police #arrest #anganwadi #viajyawada #chalo-vijayawada
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe