Anganwadi: నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్‌వాడీ కేంద్రాల్లో 9వేల ఉద్యోగాలు!

మహిళా నిరుద్యోగులకు త్వరలో రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇంటర్ అర్హతతో అంగన్‌వాడీ కేంద్రాల్లో 9వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీచర్, సహాయకుల ఉద్యోగాభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

Anganwadi: నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్‌వాడీ కేంద్రాల్లో 9వేల ఉద్యోగాలు!
New Update

Anganwadi Teacher Recruitment 2024: తెలంగాణ‌లోని మహిళా నిరుద్యోగులకు త్వరలో భారీ శుభవార్త అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, సహాయకుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఈ మేరకు దాదాపు 9వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలచేయబోతున్నట్లు సమాచారం. కాగా ఈ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వారికి సూపర్‌వైజర్లుగా పదోన్నతులు..
రేవంత్ సర్కార్ నుంచి అనుమతులు రాగానే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనున్నట్లు సమాచారం. మొత్తం తెలంగాణలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలుండగా.. ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు సహాయకురాలు తప్పనిసరి. గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైనవారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్నవారికి సూపర్‌వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.

ఇది కూడా చదవండి: Tollywood: మంచు మనోజ్, నాగ చైతన్యతో పాటు రెండో పెళ్లి చేసుకున్న సెలెబ్రెటీలు వీళ్ళే ..

విద్యా అర్హతలివే:
అంగన్ వాడీలో టీచర్‌తో పాటు హెల్పర్ పోస్టులకు కనీసం ఇంటర్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. 18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య వయసుండాలి. ఇక ఇప్పటికే పనిచేస్తున్న 50 శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించనున్నారు. అలాగే సూపర్‌వైజర్‌ పోస్టులను 50 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. 5ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లకు నిబంధనలకు అనుగుణంగా పదోన్నతులు కేటాయించనున్నారు. ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యార్హతలు లేకపోవడంతో.. టీచర్ల పోస్టుల భర్తీలో కొత్తవారికే అవకాశం ఇవ్వాలని శిశు సంక్షేమశాఖ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

#9000-posts #telangana-anganwadi-recruitment
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe