తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పని భారం తగ్గించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ డిమాండ్ చేసింది. కనీస వేతంగా 27 వేల రూపాయలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసింది. తమకు వేతనాలు పెంచుతామని గతంలో ఎన్నికల సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం జగన్ నెరవేర్చాలన్నారు.
అంగన్ వాడీ టీచర్లు, వర్కర్ల రాష్ట్రస్థాయి సదస్సు ను విజయవాడలో నిర్వహించారు. గతంలో ఎన్నికలకు ముందు జగన్ ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. తెలంగాణలో కన్నా వేయి రూపాయలు జీతం ఎక్కువ ఇస్తానని హామీ ఇచ్చాడన్నారు. పక్క రాష్ట్రం కంటే 3 వేల రూపాయలు తక్కువ జీతం ఇవ్వటం దారుణమని మండిపడ్డారు
ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
వేతనాలు పెంచుతామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు తాము న్యాయం చేయాలని కోరితే అరెస్టులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు.
అంగన్వాడీలపై రాజకీయ వేధింపులను అరికట్టకట్టాలి డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లాగే తమకు సెలవులు, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు.
రోజురోజుకూ తమపై పని భారం పెరిగిపోతోందని వాపోయారు. యాప్ ల ద్వారా తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. రూ. 11,500 వేతనంతో తాము తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో రూ. 13,600ను గత రెండేండ్లుగా ఇస్తున్నారని వెల్లడించారు. అంగన్ వాడీ మహిళల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. 26వేల వేతనం ఇవ్వాలన్నారు.