11 మంది చనిపోయినా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడంలేదు: జగన్ ఫైర్

రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడం లేదని ఫైర్ అయ్యారు.

ys jagan
New Update

విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని ఐదు గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో డయేరియా బారిన పడ్డారు. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇంకొందరు వాంతులు, విరేచనాలతో ఇళ్ల వద్దనే వైద్య తీసుకుంటున్నారు. ఈ వ్యవహారమంతా గత శనివారం నుంచి జరుగుతున్నా కూటమి ప్రభుత్వం నిద్రపోతుందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు.

ఇది కూడా చూడండి: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!

చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడం లేదు

11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడం లేదని ఫైర్ అయ్యారు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

ఇది కూడా చదవండి: డిప్యూటీ కలెక్టర్​ పీవీ సింధు.. ఆన్‌డ్యూటీ మరో ఏడాది పొడిగింపు

బాబు వచ్చాక జీతాలు రావడం లేదు

లిక్కర్‌, ఇసుక స్కాంలలో నిండామునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయని.. బాబు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడంలేదని అన్నారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని.. దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చి నుంచి పెండింగ్‌లో పెట్టారని తెలిపారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారన్నారని.. జీరో వేకెన్సీ పాలసీకి మంగళంపాడారన్నారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారన్నారు.

ఇది కూడా చూడండి: Rotten Chicken: స్పెషల్ చికెన్‌.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!

నాడు-నేడు పనులు నిలిచిపోయాయి

విలేజ్‌ క్లినిక్స్‌, పీహెచ్‌సీలను నిర్వీర్యంచేశారని.. ఫ్యామిలీ డాక్టర్‌ ఊసేలేదని విమర్శించారు. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయని.. కొత్త మెడికల్‌ కాలేజీలను అస్తవ్యస్తం చేశారని అన్నారు. స్కాంలు చేస్తూ అమ్మడానికి సిద్ధమవుతున్నారని ఫైర్ అయ్యారు.

ఇది కూడా చూడండి: సల్మాన్‌ ఖాన్‌ను దారుణంగా చంపుతాం.. పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ మెసేజ్

వైద్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు వాటిని ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి అని జగన్ ట్వీట్ చేశారు.

#ap-news #chandrababu-naidu #ys-jagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe