పోలీసులు తప్పు చేస్తే చూస్తూ ఊరుకునే వారు ఎవరూ లేరని కడప ఎంపీ, వైసీపీ కీలక నేత అవినాష్ రెడ్డి హెచ్చరించారు. ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. పోలీసుల అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ కార్యకర్తలను, నాయకులను పగలు రాత్రి తేడా లేకుండా పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన పీఏ రాఘవరెడ్డి నిత్యం పోలీసులతో మాట్లాడే వ్యక్తి అని అన్నారు. కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయన ఇంటికి రాతి వెళ్లి ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురి చేశారన్నారు. లాఠీలతో డోర్లు కొట్టి ఇంట్లో వస్తువులను చిందరవందర చేసి భయపెట్టారన్నారు. భయాందోళనకు గురి చేయకుండా స్టేషన్ కు రావాలని పిలిచినా రాఘవ వెళ్లేవాడన్నారు. ఇలా రాత్రిళ్ళు పోలీసులు చేస్తున్న తీరు రౌడీలను తలపిస్తోందన్నారు.
ఇది కూడా చదవండి: Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ అరెస్ట్?
భయపడదేది లేదు..
నిత్యం రాత్రిళ్ళు వైసీపీ కార్యకర్తలను భయాందోళనకు గురి చేయడమే పోలీసులు పనిగా పెట్టుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వ మాటలు విని నడుచుకుంటున్న పోలీసులను చూసి భయపడేవారు ఎవరూ లేరన్నారు. వర్రా రవీంద్రారెడ్డిని నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో అరెస్టు చేసినట్లు ఎల్లో మీడియానే రాసిందన్నారు. కానీ పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. నిన్న రాత్రి అంతా కర్నూలు డీటీసీలో వర్రా రవిని వేధించారన్నారు.
ఇది కూడా చదవండి: బోరుగడ్డ అనిల్‌కు స్టేషన్‌లో రాచమర్యాదలు.. మరో వీడియో వైరల్
కర్నూల్ రేంజ్ డీఐజీ, అన్నమయ్య జిల్లా ఎస్పీలు దగ్గరుండి వర్రా రవిని వేధించారన్నారు. తప్పుడు కేసులు బనాయించాలని వర్రా రవిని పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. వర్రా రవి, వైసీపీ కార్యకర్తల పట్ల పోలీసులు చేస్తుంది తప్పన్నారు. పోలీసుల చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. తక్షణం వర్రా రవిని కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు.
Also Read: వచ్చే ఏడాది సెలవులు ఇవే.. మొత్తం 50 ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు నడుచుకుంటున్న పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. టీడీపీ నేతలు చెప్పుడు మాటలు మానుకొని పోలీసులు లా అండ్ ఆర్డర్ పై దృష్టి సారించాలన్నారు. పోలీసులు తీరు మార్చుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలకు ఎవరు బెదిరే వారు ఇక్కడ లేరన్నారు.
ఇది కూడా చదవండి: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!