AP: పీసీసీ చీఫ్ షర్మిలకు మాజీ మంత్రి రోజా కౌంటర్ అటాక్ పీసీసీ ఛీఫ్ షర్మిలలకు , వైసీపీ నేత రోజాకు మాటల యుద్ధం జరుగుతోంది. అదానీ వ్యవహారంలో జగన్‌పై విమర్శలను చేసిన షర్మిల మాటలను రోజా ఖండించారు. తెలుగు రాదా.. ఇంగ్లీషు అర్ధం కాదా అంటూ విరుచుకుపడ్డారు. By Manogna alamuru 29 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి అన్నాచెల్లెళ్ళ గొడవ రోజురోజుకూ ముదురుతూనే ఉంది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, మాటలు మీరుతున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఈ వ్యవహారంలోకి ఎంటర్ అయ్యారు. జగన్‌కు అండగా ఉంటూ షర్మిల మీద కౌంటర్లు వేస్తున్నారు. వైసీపీ హయాంలో సౌర విద్యుత్ కోసం అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందం గురించి జగన్ నిన్న క్లారిటీ ఇచ్చారు. చౌకగా విద్యుత్ కోసం తాను ఒప్పందం చేసుకుంటే అదానీ పేరుతో తనను వివాదంలోకి లాగుతున్నారని ప్రత్యర్థులపై మండిపడ్డారు. దీనిపై ఇవాళ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. అన్నను టార్గెట్ చేస్తూ మాటలు అన్నారు. దీంతో రంగంలోకి దిగిన వైసీసీ నేత రోజా...రష్మిలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ప్రజలు జగన్‌కు అండగా ఉంటారు... మీకు తెలుగు రాదా...ఇంగ్లీషు అర్ధం కాదా అంటూ షర్మిలను అడిగారు రోజా. నిన్న మీ అన్న అన్నిటికీ క్లారిటీగా...ఒప్పందానికి సంబంధించి అన్ని ఆధారాలను ఇచ్చారు. అయినా సరే ఒక పేపర్ రాసిన వార్త పట్టుకుని మళ్ళీ వితండ వాదన చేస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు. 2021లో మే నెలలో సెకీ ఎక్కడ వేలం వేసింది? 2.14 పైసలకు ఎక్కడ అమ్మిందంటూ షర్మిల చేసిన వ్యాఖ్యల్ని ప్రశ్నించారు. మాట్లాడే ముందు ఆధారాలను దగ్గర పెట్టుకోవాలని సూచించారు. మీరు కోరుకుంటున్నది జగన్ పతనాన్ని, మీ లక్ష్యం అదే కానీ.. జగన్‌కు ప్రజలు అండగా ఉంటారు అంటూ రోజా, షర్మిలపై మండిపడ్డారు. అదానీ దగ్గర కరెంటు కొనలేదని..గుజరాత్ ప్రభుత్వ విద్యుత్ కంపెనీ GUVNL అదే గుజరాత్‌లోని డిస్కంల నుంచి కొనుగోలు చేశాయని రోజా గుర్తుచేశారు. అదానీతో ఒప్పందం చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పరుగులు తీయలేదని..2021లో కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందని.. అందులో రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ, మనకు అంతకు ముందు టెండర్లలో వచ్చిన అత్యల్ప ఆఫర్ అంటే రూ.2.49 కే తమ మార్జిన్‌తో సహా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన విషయం మీకు తెలియదా అని రోజా ప్రశ్నించారు. 2014లో 650 మెగావాట్లు సగటున రూ.6.49కి అప్పటి టీడీపీ ప్రభుత్వం కొంది. తరువాత కూడా 2015లో రూ.5.96కు మరో 250 మెగావాట్లకు ఒప్పందం, 2016లో రూ.6.80, రూ.5.99, రూ.4.61, రూ.4.50కి కొనుగోలు చేశారని రోజా చెప్పారు. అదే సమయంలో సోలార్ ఎనర్జీని యావరేజ్‌గా రూ.5.90కి కొనుగోలు చేశారన్నారు. అలాంటిది తమ ప్రభుత్వం యూనిట్ రూ.2.49కు కొంటే అది పెద్ద తప్పా? అది పెద్ద నేరమా? చంద్రబాబు యూనిట్ రూ.5.90లకు కొంటే మంచివాడు, జగన్ రూ.2.49లకు కొంటే చెడ్డవాడా? ఇదెక్కడి న్యాయం? అని రోజా ప్రశ్నించారు. Also Read: Delhi: పొత్తులు వద్దు..ఢిల్లీలో ఒంటరిగానే కాంగ్రెస్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి