YCP : జగన్‌కు బిగ్ షాక్.. ఈ నెల 22న జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే

జగన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పనున్నారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీ రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 22న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.

author-image
By Manoj Varma
New Update
Janasena - YCP

Samineni Udayabhanu : జగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 22న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన చేరనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే తన అనుచరులకు పార్టీ మార్పుపై సమాచారం ఇచ్చారు. ఆర్టీవీతో అయన ఎక్సక్లూజివ్ గా మాట్లాడుతూ.. తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. రేపు జగ్గయ్యపేటలో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. తన అనుచరులు కూడా జనసేనలో చేరనున్నట్లు పేర్కొన్నారు. కాగా అదే రోజు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా జనసేన కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. 

Also Read :  పాలిటిక్స్ లో మళ్లీ యాక్టీవ్ అయిన రోజా.. ఆ నేతలు ఔట్!

జనసేనతో టచ్‌లో…

ఎన్నికల్లో ఓటమి చెంది ప్రతిపక్ష హోదా సైతం దక్కకుండా ఉన్న జగన్ కు మరికొంత మంది నేతలు షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. మరికొంత మంది నేతలు వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జారుతుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు జనసేనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందే టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన, బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారం కోల్పోయి.. కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతో జంపింగ్ నేతల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితుడైన బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో.. త్వరలో మరికొంత మంది వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read :  జగన్ పై ముప్పేట దాడి.. సొంతగడ్డ కడపను జగన్ కాపాడుకోగలడా?

అక్కడ కేసీఆర్.. ఇక్కడ జగన్..

ఎన్నికల్లో ఎవరు ఉహిచని రీతిలో జగన్ (YS Jagan) ఓటమి చెందారు. అధికారంలో ఉండి కేవలం 11 స్దానలకు పరిమితం అవ్వడం రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కాగా తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జరిగిన సీన్స్ ఏపీలో జగన్ కు జరుగుతున్నాయనే రాజకీయాల్లో జరుగుతోంది. సొంత పార్టీ నేతల ఫిరాయింపులతో సతమతవుతున్న కేసీఆర్ పరిస్థితే ఇప్పుడు జగన్ కు వచ్చిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా నేతల రాజీనామాలు ఆపేందుకు కేసీఆర్, జగన్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి మరి.

Also Read :  యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు