YS Jagan : చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ప్రజల్లోకి రానున్నారు. కొత్త ఏడాది.. కొత్త జోష్ తో జనంలోకి వెళ్లనున్నారు. జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో 2రోజులపాటు సమీక్షలు చేయనున్నట్లు సమాచారం. మొత్తం 26 జిల్లాల్లో పర్యటనలు చేసేందుకు జగన్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారట.అయితే దీనిపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే డబ్బు పంపిణీ!
Also Read: అదానీకి మరో షాక్..పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించిన టోటల్ ఎనర్జీస్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో జగన్...
ఇప్పటికే ఎన్నికల ఓటమి ఎఫెక్ట్, నేతల ఫిరాయింపులు, అరెస్టులు, కేసులతో వైసీపీ క్యాడర్ బలహీనంగా మారింది. అయితే.. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు, పార్టీ బలోపేతం, కార్యకర్తలలో ఉత్సహాన్ని తెచ్చేందుకు వరుస సమావేశాలు నిర్వహించనున్నారు జగన్. పార్టీ బలోపేతంపై వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఇకపై అపాయింట్మెంట్ లేకున్నా తాడేపల్లిలోనూ ప్రతీ ఒక్కరినీ కలిసేలా ప్లానింగ్ చేయనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో జనంతో మమేకమయ్యేలా స్కెచ్ వేశారు. నియోజకవర్గ నేతలు ప్రత్యేకంగా కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: జనావాసాలపై కుప్పకూలిన బోయింగ్ విమానం
సామజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు, అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు సిద్ధమైంది. ఇప్పటికే పోలీసులు కొందరిని కేసులు నమోదు చేసి, అరెస్టులు చేశారు. కాగా ఇందులో సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర, వారిని కుటుంబ సభ్యులను వదలకుండా తప్పుడు పోస్టులు పెట్టిన కొందరు వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే కేసులు వైసీపీ బడా నేతలకు కూడా తలనొప్పిగా మారాయి. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జి సజ్జల భార్గవ్, ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్ర రవీందర్, ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే, పోసాని కృష్ణ మురళి, దర్శకుడు ఆర్జీవీ లకు పోలీసులు నోటీసులు పంపించారు. మరి పోలీసుల అరెస్ట్ జాబితాలో మరికొంత మంది నేతలు ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులకు అండగా ఉండేందుకు జగన్ పల్లె బాట పెట్టనున్నట్లు సమాచారం.
Also Read: IPL 2025: 13 ఏళ్ల కుర్రాడికి రూ.1.10 కోట్లు.. ఐపీఎల్ లో సంచలనం!