Kavya Sri : యాంకర్‌ కావ్యశ్రీపై దాడి.. ఆ పార్టీ మాజీ ఎంపీ అనుచరుడే

రాజమండ్రిలో యాంకర్‌ అండ్ ఈవెంట్‌ ఆర్గనైజర్‌ కావ్యశ్రీపై తాజాగా దాడి జరిగింది. బాకీ డబ్బులు అడిగినందుకు కావ్య శ్రీ, తన తండ్రిపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అనుచరుడు దాడి చేశాడు. దీంతో కావ్యశ్రీ తండ్రి నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update

రాజమండ్రిలో యాంకర్‌ అండ్ ఈవెంట్‌ ఆర్గనైజర్‌ కావ్యశ్రీపై తాజాగా దాడి జరిగింది. బాకీ డబ్బులు అడిగినందుకు కావ్య శ్రీ, తన తండ్రిపై నాగరాజుపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అనుచరుడు దాడి చేశాడు. డబ్బులు ఇస్తామని పిలిచి దాడి చేశారని కావ్యశ్రీ తండ్రి నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఇది కూడా చదవండి: నాగ వంశీకి షాక్.. సినిమా ఫ్లాప్ అయితే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా?

విజయవాడలో ఉండే సమయంలోనే 2021లో వైసీపీ ట్రేడ్ యూనియన్ నల్లురి వెంకట శ్రీనివాస్, కుమారుడు అభిషేక్ తమ వద్ద 3 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారని యాంకర్ కావ్యశ్రీ తండ్రి నాగరాజు చెప్పాడు. అయితే అప్పటి నుంచి డబ్బులు అడుగుతున్నా ఇవ్వడం లేదని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు.

నన్ను, మా నాన్నను కాలర్ పట్టుకుని కొట్టారు

రాజమండ్రిలో ఈవెంట్‌కు వచ్చిన సందర్భంగా.. తమకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగితే ఇస్తానని చెప్పి తన ఆఫీసుకు రమ్మన్నాడని.. అయితే అక్కడకి వెళ్లాక ఆయన లేరని అన్నారు. అదే సమయంలో ఆయన ఇంటికి వెళ్లామని అన్నారు. వాళ్ల ఇంటి దగ్గర తనను, తన తండ్రిని కాలర్ పట్టుకుని కొట్టి.. బయటకు గెంటేశారని యాంకర్ కావ్యశ్రీ తెలిపింది. దీంతో వెంటనే రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని పేర్కొంది. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్ -​ విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు

కాగా ఇదే విషయంపై గతంలో మాజీ ఎంపీ మార్గాన్ని భరత్‌కు చెప్పామని.. దానికి ఆయన కూడా డబ్బులు ఇప్పిస్తానని ఒప్పుకున్నారని యాంకర్ కావ్య శ్రీ తండ్రి చెప్పాడు. కానీ ఆయనే ఇప్పుడు తమ అనుచరుల చేత మళ్ళీ తమపై కేసు పెట్టిస్తున్నారని యాంకర్ తండ్రి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే దాడి సమయంలో కావ్యా విజువల్స్‌ రికార్డ్‌ చేయడంతో ఆమెను కూడా కొట్టారని యాంకర్ చెప్పుకొచ్చింది. 

Also Read :  దసరాకు దుమ్ములేపిన మందుబాబులు.. ఎన్ని కోట్లు తాగారంటే?

Also Read :  బాంబు బెదిరింపులు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

#ycp #margani-bharath #anchor #kavya-sri
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe