Weather Report : నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదలడంతో శుక్రవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదలడంతో శుక్రవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ మురళీ బుధవారం రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రి వర్గాలు నిలిపివేయడం దురదృష్టకరమన్నారు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీతారాం. పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం అని బీరాలు పలికే జగన్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం దాదాపు రూ.1500 కోట్లు ఆసుపత్రులకు చెల్లించాలని వెల్లడించారు.
పిఠాపురంలో గెలుపు ఎవరిదని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్ట్రాంగ్రూముల భద్రతపై అధికారులు నిరంతరం నిఘా పెట్టారు. కౌంటింగ్ రోజు పిఠాపురం, కాకినాడలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఇటీవల ఇంటలిజెన్స్ ఈసీకి నివేదిక అందించింది. దీంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కంఠమనేనివారిగూడెంలోని చెరువుగట్టుపై మూత్ర విసర్జన చేసినందుకు దళిత యువకుడు గెడ్డం రవి కుమార్ను.. కొందరు దుండగులు విచక్షణారహితంగా కొట్టారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సాయి, రాజ్ కుమార్ అనే యువకులను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొట్టింది. సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
ఉండి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు నీలం సంజీవరెడ్డిని కలిసి తీయించుకున్న ఫొటోను పోస్టు చేశారు.
ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల16 రాత్రి నుంచి చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తోపాటు మరో 14 మంది అనుచరులు బెంగళూరుకు మకాం మార్చినట్టు ప్రాథమిక సమాచారం.
ఏపీలో కూటమి గెలుపు పక్కా అని మాజీ మంత్రి హరిరామజోగయ్య జోస్యం చెప్పారు. మూడు పార్టీలు వేర్వేరుగా గెలిస్తే ఫలితం వేరేలా ఉండేదన్నారు. కూటమి విజయానికి ముఖ్య కారకులు కాపులు అని అన్నారు. కూటమికి 120 అసెంబ్లీ,18 ఎంపీ స్థానాలు వస్తాయన్నారు.