AP : అంబటికి సినిమా చూపిస్తాం.. కేంద్రమంత్రి 24 గంటల డెడ్ లైన్!

అంబటి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అంబటి బరితెగించి చంద్రబాబును దుర్మార్గమైన భాషతో కించపరిచారని, ఇప్పటినుంచి మీకు నిజమైన సినిమా చూపిస్తాం, 24 గంటల్లో ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది' అంటూ వ్యాఖ్యానించారు.

New Update
ambati

ambati Photograph: (ambati)

AP: అంబటి రాంబాబు వ్యాఖ్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అంబటి బరితెగించి ముఖ్యమంత్రి చంద్రబాబును దుర్మార్గమైన భాషతో కించపరిచారని, ఇప్పటివరకు తాము సహనంతో ఉన్నామని పేర్కొన్నారు. 'ఇప్పటినుంచి మీకు నిజమైన సినిమా చూపిస్తాం, 24 గంటల్లో ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టప్రకారమే బరితెగించిన వారికి గుణపాఠం చెబుతామని పెమ్మసాని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ను అత్యంత అసభ్యంగా వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు దూషించాడని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు బరితెగించి మాట్లాడారు. అత్యంత దుర్మార్గమైన భాషతో చంద్రబాబును కించపరిచారన్నారు. ఈ వ్యవహారంలో చట్టప్రకారమే ముందుకు వెళ్తాం’ అని పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. అంతకుముందు హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిని తిడితే ప్రజలను తిట్టినట్లే అన్నారు. అధికారంలో కోల్పోయేసరికి వైసీపీ నేతలంతా పిచ్చిపట్టినట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ చూస్తూ ఊరుకోం అని హోంమంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు.
 
 వైసీపీ నేత అంబటి రాంబాబు ఉపయోగిస్తున్న భాష అత్యంత జుగుప్సాకరంగా ఉందని, ఆయన మాట్లాడే తీరును కనీసం ఆయన కుటుంబ సభ్యులు కూడా సమర్థించరని రాష్ట్ర హోం మంత్రి అనిత విమర్శించారు. అంబటి తీరుతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆమె శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. "అంబటి రాంబాబు ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించే పన్నాగంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. రాజకీయాల్లో హుందాతనాన్ని విస్మరించి, అధికారులను, ప్రత్యర్థులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని ఆమె హితవు పలికారు.

Advertisment
తాజా కథనాలు