Vundavalli : ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సంచలన కామెంట్స్‌

ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. మాజీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఈ ఎన్నికల్లో తనను ఓడించిన NDA కూటమికి జగన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

New Update
vundalli arun

ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. మాజీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఈ ఎన్నికల్లో తనను ఓడించిన NDA కూటమికి జగన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  అసలు NDA అభ్యర్థికి జగన్ మద్దతు ఎందుకుమద్దతు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.  వ్యతిరేకులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని ఆయన నిలదీశారు. తనపై కేసులు పెట్టిన కాంగ్రెస్ అంటే ఇష్టం లేకపోతే ఓడించిన కూటమికి మద్దతు ఇస్తారా అని ఉండవల్లి ప్రశ్నించారు. సుదర్శన్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని జగన్ గుర్తించాలని సూచించారు. రాజ్యాంగాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న సుదర్శన్ రెడ్డికి..ఓటేసి గెలిపించాలని TDP, YCP, జనసేన, BRS పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. 

ఇక రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.  ఎన్డీఎ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్,  కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ జరగనుంది. లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు.  లోక్‌సభలో543 మంది ఎంపీలు(ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది) రాజ్యసభలో 233 మంది సభ్యులు (ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీ) ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమికి లోక్ సభలో 293 మంది సభ్యుల మద్దతు ఉంది. అటు  ఇండియా కూటమికి లోక్ సభలో 204 మంది సభ్యుల మద్దతు ఉంది.  

రాజ్యసభలో NDA బలం 133 కాగా ఇండియా కూటమి బలం 77..  మొత్తం ఉమ్మడి సభలు కలిపి 781 కాగా  గెలుపుకు391  ఓట్లు కావాలి. ఈ లెక్కన చూస్తే ఎన్డీఏ అభ్యర్థికి.. 293+133=426 (వైసీపీ-11, ఇండిపెండెంట్లు) బలం ఉందని చెప్పాలి.  ఇండియా కూటమికి.. 204+77=281 (ఎంఐఎం-1, ఆప్-4) బలం ఉంది. రాజ్యసభలో 12 మంది నామినేటెడ్ ఎంపీలు ఉంటారు. బీఆర్ఎస్(-4), బీజేడీ(7) ఎన్నికకు దూరంగా ఉంది.  

 ఏ పార్టీ మద్దతు ఎవరికి?

రాధాకృష్ణన్(ఎన్డీఏ అభ్యర్థి): బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన-షిండే, YCP, LJP, అన్నాడీఎంకే(పళనిస్వామి), JDS, జనసేన, RLD, అప్నాదళ్, NCP(అజిత్ పవార్), SKM, స్వతంత్రులు.

సుదర్శన్ రెడ్డి (ఇండీ కూటమి): కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, TMC, ఆప్, డీఎంకే, శివసేన(ఉద్ధవ్), NCP(శరద్ పవార్), RJD(లాలూ), CPM, CPI, ఎంఐఎం.

Advertisment
తాజా కథనాలు