YS Jagan: అంతా రెడీ.. విజయదశమికి ఛలో విశాఖ.. ఈ నెల 23న సీఎం జగన్ గృహ ప్రవేశం
విజయదశమికి ఛలో విశాఖ.. ముహుర్తం ఫిక్సైంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఇక మిగిలింది కేవలం మరో మూడు వారాలే. దీంతో అధికారులు అన్ని పనులను పూర్తి చేస్తున్నారు.
విజయదశమికి ఛలో విశాఖ.. ముహుర్తం ఫిక్సైంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఇక మిగిలింది కేవలం మరో మూడు వారాలే. దీంతో అధికారులు అన్ని పనులను పూర్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పాలన విశాఖ నుంచి చేసేందుకు ముహుర్తం ఖరారు అయింది. అక్టోబర్ 22న విశాఖకు సీఎం జగన్ వెళతారని...అక్టోబర్ 23న సీఎం కార్యాలయంలో అడుగుపెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కార్యాలయం పనులు చివరి దశకు చేరుకున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.
విశాఖపట్నం (Vizag) లోని వైఎంసీఏ తీరానికి ఓ భారీ చెక్కె పెట్టె కొట్టుకు (Wooden Box) వచ్చింది. శుక్రవారం రాత్రి సమయంలో మత్య్సకారులు ఈ పెట్టెను గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బీచ్ కు చేరుకుని పురాతన చెక్క పెట్టెను ప్రొక్లెనయిర్ సాయంతో ఒడ్డుకు తీసుకుని వచ్చారు. పెట్టె చాలా భారీగా ఉంది.
జన్మ భూమి ఎక్స్ ప్రెస్(Janma bhumi express) లో పొగలు రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.మంగళవారం ఉదయం లింగంపల్లి (Lingam Palli)నుంచి విశాఖపట్టణం (Vizag) వెళ్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ లోని జనరల్ బోగీలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ ప్రక్రియ నిలిచిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను ఎలా లాభాల బాట పట్టించాలో ఆలోచిస్తున్నామన్నారు. ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే నడపాలని చూస్తున్నామన్నారు.
విశాఖలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్ధితిలో మహిళ డెడ్ బాడీ కనిపించింది. మృతి చెందిన మహిళ ఒంటిపై బట్టలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోపాలపట్నం ఆర్టీసీ డిపో ఎదురు బాలాజీ గార్డెన్స్‌లో ఈ ఘటన జరిగింది. అనుస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కోసం భార్య నారా భువనేశ్వరి, కోడలు బ్రహ్మణికి తిప్పలు తప్పడం లేదు. అక్రమ కేసు నుంచి బయట పడాలని వారు చెయ్యని పూజ లేదు.. మెక్కని దేవుడు లేడు. ఏ దేవుడైనా కరుణించకపోడా అంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నే ఉన్నారు. తాజాగా, అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం, చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ నేతలు చేపట్టిన నిరసనలో భువనేశ్వరి, బ్రహ్మణిలు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించనున్నారు.
రైలు ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలు అస్వాధించడం అనేది మాటల్లో వర్ణించలేని అనుభూతి. అలాంటి అందమైన ప్రయాణం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అదే ప్రకృతి అందాలకు నిలయమైన ప్రాంతాలను చూడాలని ఎంతోమంది తపిస్తుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా కుటుంబసభ్యులతో అక్కడ గడపాలనుకుంటారు.
తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడిన కారణంగా శుక్రవారం సాయంత్రం నుంచి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నాయని ప్రకటించింది.