South Central Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 8 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను రెండు నెలల పాటు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాచిగూడతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ఎనిమిది రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది.