Chandrababu : ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు
AP: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి సమావేశంలో పాల్గొననున్నారు. కాగా చంద్రబాబు కాన్వాయ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి సమావేశంలో పాల్గొననున్నారు. కాగా చంద్రబాబు కాన్వాయ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రుషికొండ ప్యాలెస్‌పై పార్టీ జెండా ఎగుర వేశారు. కాగా, ఇప్పటి వరకు రుషికొండపై వైసీపీ ప్రభుత్వం ఎవ్వరిని అనుమతించని విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
విశాఖ ఎంపీగా తన గెలుపును ఎవరు ఆపలేరన్నారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారన్నారు. కూటమి తరుపున భరత్, వైసీపీ నుండి బొత్స ఝాన్సీ ఇద్దరు తనతో పోటీ పడలేకపోయారని పేర్కొన్నారు.
విశాఖలో మరో మహిళతో ఉన్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. భార్యను విడిచిపెట్టి మరో మహిళతో కాపురం పెట్టాడు భర్త వెంకటసాయి తేజ. బాధితురాలు నక్షత్ర మిస్ వైజాగ్, తెలుగు అమ్మాయి అవార్డు విన్నర్. తనకు రోజుకో మహిళ కావాలని నక్షత్రపై దాడి చేసేవాడని తెలుస్తుంది.
ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో అధికారం మళ్లీ వైసీపీదేనని, జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
విశాఖ మధురవాడ కాలనీలో మైనర్ బాలిక బలవన్మరణం చెందింది. మొబైల్ ఫోన్ ఎక్కువ చూస్తుందని తల్లి మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. చికిత్స కోసం గాయిత్రి హాస్పటల్ కి తరలించిన అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
విశాఖ కేజీహెచ్ లో లైంగిక వేధింపుల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూపరిండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ లైంగికంగా వేదించారంటూ నర్సింగ్ సూపరిండెంట్ పోలీసులకు పిర్యాదు చేసింది. విశాఖ ఒన్ టౌన్ పోలీసులు డాక్టర్ అశోక్ కుమార్ పై FIR నమోదు చేశారు.