/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/abusing.jpg)
vizag incident
Vizag Incident: నేటి సమాజంలో అమ్మాయిల పై దాడులు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. ప్రేమించలేదని, ప్రేమకు అంగీకరించలేదని అమ్మాయిల పై దారుణాలకు పాల్పడుతున్నారు. మొహాలపై యాసిడ్ పోయడం, హత్యలు దాడి చేయడం వంటి చేస్తున్నారు కొందరు ప్రేమోన్మాదులు. తాజాగా విశాఖలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రేమ అంగీకరించలేదని యువతి తల పగలగొట్టాడు ప్రేమోన్మాది.
Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్!
మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులు
కశ్మీర్‌కు చెందిన నీరజ్‌అనే యువకుడు ప్రేమ అంగీకరించలేదని యువతిపై దారుణంగా ఎటాక్ చేశాడు. విచక్షణ కోల్పోయి అమ్మాయి తలపై రాడ్డుతో బలంగా కొట్టాడు. ఆ యువతికి తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నీరజ్ ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే నీరజ్ గత కొన్ని రోజులుగా బాధిత యువతిని మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా నిందితుడిపై రెండుసార్లు ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని సమాచారం.
Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా
Also Read: HBD Kamal Haasan: కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా?
Follow Us