TSC In Visakha:
ఆంధ్రాలోని విశాఖ మరింత డెవలప్ కానుంది. ఇప్పటికే అక్కడ కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు వాటి లిస్ట్‌లో టీసీఎస్ కూడా చేరబోతోంది. సారతీరంలో టీసీఎస్‌ను ఏర్పాటు చేయనున్నామని ఏపీ ఐటీ మంత్రి లోకేశ్ ఈరోజు ప్రకటించారు. దీని ద్వారా 10 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. ముఖ్యంగా ఈవీ, ఏరోస్పేస్, పర్యాటక, స్టీలు రంగాల్లో పెట్టుబడులను పరిశీలిస్తామని టాటా గ్రూపు చెప్పింది. దీనికి సంబంధించి నిన్న టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో మంత్రి నారా లోకేశ్ ముంబయిలో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో బుధవారం బిగ్ అనౌన్స్ మెంట్ ఉంటుందని కూడా మంత్రి లోకేశ్ చెప్పారు. దానికి తగ్గట్టే.. ఈరోజు టీసీఎస్ కంపెనీ గురించి ప్రకటించారు.
ఆంధ్రాలో కూటమి అధికారంలోకి వచ్చాక నెమ్మదిగా ఇక్కడ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో లులు, ఒబెరాయ్, బ్రూక్‌ఫీల్డ్, సుజలాన్ ఇప్పటికేఇక్కడ పెట్టుబడులు పెడతామని చెప్పారు. ఇప్పుడు తాజాగా టాటా గ్రూప్ కూడా ఈ లిస్ట్‌లో చేరింది. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే పేరుతో మంత్రి లోకేశ్ పెద్ద పెద్ద కంపెనీలను ఆహ్వానించారు. ఏపీని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని లోకేశ్ ఎప్పుడో ప్రకటించారు.
Also Read: ఐసీయూలో రతన్ టాటా? విషమంగా ఆరోగ్యం?