ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వైజాగ్‌లో మూడు కారిడార్లుగా 46.23 కిమీ మేర మెట్రో రైలు నిర్మించేందుకు తొలి దశలో చేపట్టనున్న పనుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)కు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో స్టీల్‌ప్లాంటు-కొమ్మాది, గురుద్వారా-పాత పోస్టాఫీసు, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు మార్గంలో మూడు కారిడార్లు ఉండనున్నాయి. కాగా విశాఖ మెట్రో ప్రాజెక్టుకు రూ. 11,498 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు.
Also Read: హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్.. పదోతరగతి ఉంటే చాలు!
కాగా విశాఖలో స్టీల్ ప్లాంట్ - కొమ్మాది వరకు 34.4 కిమీల మేర ఒకటవ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. వీటి మధ్య 29 స్టేషన్లు ఉన్నాయి. అలాగే గురుద్వార్ - పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.08కిమీల మేర రెండవ కారిడార్ ఉంటుంది. వీటి మధ్య 6 స్టేషన్లు ఉండనున్నాయి. ఇక మూడవది తాటిచెట్ల పాలెం - చినవాల్తేర్ వరకు 6.75 కిమీల మేర నిర్మించనున్నారు. వీటి మధ్య 7 స్టేషన్లు ఉన్నాయి.
వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్
Also Read: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..!
కారిడార్-1
స్టీల్ ప్లాంట్ TO కొమ్మాది
స్టీల్‌ప్లాంటు వద్ద మొదలై.. వడ్లపూడి, శ్రీనగర్, చినగంట్యాడ, గాజువాక, ఆటోనగర్, బీహెచ్‌పీవీ, షీలానగర్, విమానాశ్రయం, కాకానినగర్, ఎన్‌ఏడీ, మాధవధార, మురళీనగర్, ప్రభుత్వ పాలిటెక్నిక్, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీ, వెంకోజిపాలెం, హనుమంతువాక, ఆదర్శనగర్, జూ పార్క్, ఎండాడ, క్రికెట్ స్టేడియం, శిల్పారామం, మధురవాడ, కొమ్మాదికి చేరుకుంటుంది.
Also Read: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్
కారిడార్-2
గురుద్వార్ TO పాత పోస్ట్ ఆఫీస్
ద్వారకానగర్ నుంచి ప్రారంభమై.. ఆర్టీసీ కాంప్లెక్సు, డాబాగార్డెన్స్, సరస్వతీపార్క్, పూర్ణామార్కెట్, పాతపోస్టాఫీసుకు చేరకుంటుంది.
కారిడార్-3
తాటిచెట్లపాలెం TO చినవాల్తేరు
రైల్వే న్యూకాలనీ నుంచి ప్రారంభమై.. రైల్వేస్టేషన్, అల్లిపురం కూడలి-ఆర్టీసీ కాంప్లెక్సు, సంపత్ వినాయగర్ ఆలయం, సిరిపురం, ఏయూ, చినవాల్తేరుకు చేరుకుంటుంది.
ఈ మూడు కారిడార్లను నిర్మించడానికి సుమారు రూ.99.75 ఎకరాలు అవసరం కానున్నాయని.. దీనికోసం దాదాపు రూ.882 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
Also Read: ఏపీలో 280 పోస్టులకు నోటిఫికేషన్..
విజయవాడ మెట్రో ప్రాజెక్ట్
అలాగే విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ అందింది. ఈ విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు రూ.11,009 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. విజయవాడలో రెండు కారిడార్లు నిర్మించనున్నారు. వీటిని 38.67 కి.మీల మేర ఏర్పాటు చేయనున్నారు. మొదటి కారిడార్‌ను గన్నవరం - పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు నిర్మించనున్నారు. అదే సమయంలో రెండవ కారిడార్‌ను పండిట్ నెహ్రూ బస్టాండ్ - పెనుమలూరు వరకు నిర్మించనున్నారు. ఇక మరొక కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ - అమరావతి వరకు నిర్మించనున్నారు.