YCP: లైటింగ్ కాంతుల్లో మెరిసిపోతున్న వైసీపీ కార్యాలయం!
తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని వైసీపీ జెండారంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా,వైసీపీ వర్గాల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.
తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని వైసీపీ జెండారంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా,వైసీపీ వర్గాల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.
ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అందరూ సమన్వయంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో 'రవిప్రకాష్ సిలికన్ఆంధ్ర సంజీవని' అనే ఆసుపత్రి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ హాస్పిటల్లో లభిస్తున్న ఉచిత, మెరుగైన వైద్యం కోసం వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున రోగులు ఇక్కడికి వస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియ భాగంగా పెనమలూరు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ నయీమ్ అద్మీ ఆస్మి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదన్నారు. పెనమలూరులో చిన్న చిన్న గొడవలు జరిగినా.. ప్రసుత్తం అంతా ప్రశాంతంగా ఉందన్నారు.
ఏపీ ప్రజలు ఐదేళ్ల పాటు పడ్డ కష్టాలకు రేపటితో అడ్డుకట్ట పడబోతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దని సూచించారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు టెలీకాన్ఫరెన్స్ ద్వారా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
ఏపీ లోక్‌సభ పోలింగ్‌కు ముందు RTV స్టడీలో ఏం చెప్పామో, పోస్ట్ పోల్ స్టడీలో ఎన్ని స్థానాల్లో గెలుపు తారుమారు అయ్యాయో తేలింది. మా ప్రీ పోల్ స్టడీతో పోలిస్తే, పోస్ట్ పోల్ స్టడీలో వైసీపీకి ఒకటి తగ్గి, బీజేపీకి ఒక స్థానం పెరిగింది. ఓవరాల్‌గా టీడీపీ కూటమి 20 ఎంపీ సీట్లు గెలవబోతుంది.
ఏపీ ఎన్నికల ఫలితాల వేళ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఫొటో, వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషిద్ధం అన్నారు. నిరంతరం పోలుసుల నిఘా ఉంటుందని తెలిపారు.
AP: పెనమలూరులో విషాదం చోటుచేసుకుంది. రెండోసారి కూడా కూతురు పుడుతుందని.. అబార్షన్ చేసుకోవాలని అత్తమామలు, భర్త ఒత్తిడి చేయడంతో కావ్య శ్రీ అనే 5 నెలల గర్భవతి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు