AP Exit Polls : కూటమిలో జోష్ నింపిన ఎగ్జిట్ పోల్స్.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు!
మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఏపీలో కూటమి గెలుస్తుందని చెప్పడంతో ఆయా పార్టీల నేతలు సంబరాలకు ఏర్పాట్లు ప్రారంభించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడు? మంత్రివర్గంలో ఎంత మందికి ఛాన్స్ ఉంటుంది? పవన్ డిప్యూటీ సీఎం అవుతారా? అన్న చర్చ మొదలైంది.