Pawan Kalyan : నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మంగళవారం సచివాలయానికి పవన్ రానున్నారు.
ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మంగళవారం సచివాలయానికి పవన్ రానున్నారు.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 24 నుంచి 26 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 24న ప్రొటెం స్పీకర్ను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
AP: గత ప్రభుత్వంలో అంగన్వాడీలు ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ తాము పరిష్కరిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హామీ ఇచ్చారు. సోమవారం మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె గిరిజన స్కూళ్ల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పారు.
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు సీఎం చంద్రబాబును కలిశారు. 'పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధి మీరే. మీ కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షునిగా కీలక బాధ్యతలిచ్చాం. పార్టీలో యువరక్తాన్ని చేర్చండి' అని బాబు సూచించారు.
AP: గంజాయి స్మగ్లర్స్, వినియోగదారులకు మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. గంజాయిపై బతికేద్దామనుకేవారి ఆటలు ఇకపై సాగవని అన్నారు. గంజాయి స్మగ్లింగ్, వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం అని చెప్పారు. గంజాయి విషయంలో ఏ రాజకీయ నాయకుడు ఉన్నా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
జూన్ 19న జగన్ అధ్యక్షతన వైసీపీ విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ మీటింగ్ కు గెలిచిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు, ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ హైకమాండ్ ఆహ్వానించింది.
తాడేపల్లిలో ప్రజలకు దారి కష్టాలు తీరిపోనున్నాయి.జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఇంటి వెనకు నుంచి ఎటువంటి రాకపోకలు జరగకుండా పోలీసులు కట్టడి చేశారు.ఆ ప్రాంత వాసులు పడుతున్న ఇబ్బందుల గురించి కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి స్పందించింది.
AP: చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వానికి లాయల్టీగా ఉన్న అధికారులపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. తాజాగా ఐఏఏస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పై వేటు వేసింది బాబు సర్కార్. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పోలా భాస్కర్ ను నియమించింది .