Snake: ఆసుపత్రికి వెళ్లిన పేషెంట్.. స్కానింగ్ రూమ్లో పసిరిక పాము..
అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ స్కానింగ్ రూమ్లో పసిరిక పాము దర్శనమిచ్చింది. స్కానింగ్ కోసం వచ్చిన పేషెంట్ కిటికీపై ఉన్న పసిరిక పామును చూసి వెంటనే వైద్య సిబ్బందికి తెలిపింది. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది పామును కొట్టి బయటపడేయంతో పేషెంట్లు ఊపిరి పీల్చుకున్నారు.