బీసీ జనగణన అని మభ్యపెట్టాలని చూస్తున్నారు.!
బడుగు బలహీన వర్గాలను వైసీపీ అణగదొక్కుతుందన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. 34% ఉన్న బీసీలకి వైసీపీ 24% రాజకీయ రిజర్వేషన్ తగ్గించిందని..మళ్లీ ఇప్పుడు బీసీ జనగణన అని మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
బడుగు బలహీన వర్గాలను వైసీపీ అణగదొక్కుతుందన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. 34% ఉన్న బీసీలకి వైసీపీ 24% రాజకీయ రిజర్వేషన్ తగ్గించిందని..మళ్లీ ఇప్పుడు బీసీ జనగణన అని మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.
30 సీట్ల కోసం 1500 కోట్లకు పవన్ అమ్ముడుపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు KA పాల్. ఈ సందర్భంగానే కేసీఆర్, కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తనను మరోసారి గెలిపించాలని తండ్రికొడుకులు తన కాళ్ల బేరానికి వచ్చారని అన్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పార్థసారథి పై జనసైనికులు ఫైర్ అయ్యారు. జగనన్న కాలనీ పేరుతో ఎమ్మెల్యే వేల కోట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణతో వైసీపీ పతనం ఖాయమన్నారు.
దొంగ ఓట్ల పై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేత బోండా ఉమా. 25 ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ లో ఉన్నాయని ఆరోపించారు. వైసీపీ ఇష్టారీతిన ఓట్లు నమోదు చేస్తున్నందుకే..జగన్.. వై నాట్ 175 అంటున్నారని విమర్శించారు.
ఎన్టీఆర్ జిల్లాలో వీటీపీఎస్ బూడిద అక్రమ రవాణాను ప్రశ్నించడానికి బయలుదేరిన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఇంటి వద్ద ధర్నాకు దిగిన టీడీపీ నేతలు బూడిద అక్రమ రవాణా అరికట్టి ప్రజాధనం కాపాడాలి అంటూ నినాదాలు చేశారు.
నందిగామలో టీడీపీ - జనసేన సమావేశం రసాభాస జరిగింది. టీడీపీ నాయకులు తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు జనసేన కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు బోల్దిశెట్టి శ్రీకాంత్. సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్టేజి పైకి వెళ్ళేందుకు నిరాకరించారు.
ఎన్టీఆర్ జిల్లాలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. కొండపల్లిలోని బూడిద చెరువుపై వైసీపీ చేస్తున్న అక్రమాలను పరిశీలించి, అధికారులకు ఫిర్యాదు చేయడానికి బయలుదేరిన ఆయనను అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని హైకోర్టును కోరింది సీఐడీ.