కేంద్రంపై రైతు సంఘాలు కన్నెర్ర.!
విజయవాడలో రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం నిర్వహించింది. ఈ నెల 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యక్రమాం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు.
విజయవాడలో రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం నిర్వహించింది. ఈ నెల 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యక్రమాం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు.
మంత్రి సజ్జల సమక్షంలో వైసిపి లో చేరారు జనసేన పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ పసుపులేటి పద్మావతి, ఆమె కుమారుడు సందీప్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అహంకారి అని..టిడిపి కోసమే పని చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు.
మాజీ మంత్రి దేవినేని ఉమాపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి అంటూ ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే ఉమా కంటే జనసేన పార్టీ అక్కల గాంధీనే బలమైన ప్రత్యర్థిగా చూస్తున్నట్లు తెలిపారు.
ఇబ్రహీంపట్నం సీఐ చేస్తున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఓ దళిత మహిళ గూడపుడి జయప్రద. తనకు రావాల్సిన డబ్బును అడిగినందుకు సంతోష్ అనే వ్యక్తి పోలీసుల సహకారంతో ఇంటి దగ్గర దాడికి దిగారని వాపోయింది.
‘బాబు ష్యూరిటీ..భవిష్యత్తుకు గ్యారెంటీ’ అనే టీడీపీ కార్యక్రమంపై మంత్రి సజ్జల కౌంటర్లు వేశారు. పచ్చ దొంగల ముఠా ఇళ్లలోకి చొరబడుతోంది..ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..అంటూ హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో గ్యారెంటీ కార్డ్ ఇచ్చి ఐదు కోట్ల మందిని మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులపై విజయవాడలో సీపీఐ చేపట్టిన నిరసన దీక్ష రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ..కేవలం బీజేపీకి సపోర్ట్ చేసేందుకే చంద్రబాబుకి బెయిల్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. కన్న తండ్రికి వెన్నుపోటు పొడిచి.. ఆయన మానసిక వేదనతో చనిపోయేలా చేసిన పురంధేశ్వరి లాంటి కూతురు ఎవరికీ ఉండదన్నారు.
మతిస్థిమితం లేని ఓ యువతిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు వైసిపి నేత కోటేష్. యువతిని అత్యాచారం చేసి ఆరు నెలల గర్భవతిని చేసిన సంఘటన అతి దారుణమన్నారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని తిరువూరు ఆర్డిఓకి వినతిపత్రం అందజేశారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో "గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది" అనే నిరసన కార్యక్రమం చేపట్టారు టీడీపీ జనసేన కార్యకర్తలు. రోడ్ల దుస్థితిపై రోడ్డెక్కారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆందోళన చేశారు.