మధ్యాహ్నం 2:30 గంటలకు తుఫాను తీరం దాటే అవకాశం...!
ఏపీ తీరం వెంబడి అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బాపట్ల వద్ద తీరం దాటనున్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.
ఏపీ తీరం వెంబడి అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బాపట్ల వద్ద తీరం దాటనున్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.
ఏపీలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. తీరం వెంట అలల తాకిడి ఎక్కువగా ఉంది. మిచౌంగ్ బాపట్ల వద్ద తీరం దాటనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మిచౌంగ్ ఎఫెక్ట్ తెలంగాణ మీద చూపిస్తుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.దీంతో పలు జిల్లాలకు వాతావరణశాఖాధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఏపీ గ్రామ సచివాలయాల్లోని 1,896 పశు సంవర్థక సహాయకుల నియామాలను చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు.ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 11, 2023, రుసుం చెల్లించడానికి ఆఖరి తేదీ డిసెంబర్ 10.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం జగన్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
మిచౌంగ్ తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది.దీని వల్ల ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మచిలీపట్నంలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి.