Andhra Pradesh : వైసీపీ మేనిఫెస్టో విడుదల అప్పుడే..
ఏప్రిల్ 26 సీఎం జగన్ తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. గుంటూరులోని తాడేపల్లిలో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వైసీపీ ఏం చేస్తుందనే దానిపై క్లారిటీ రానుంది.
ఏప్రిల్ 26 సీఎం జగన్ తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. గుంటూరులోని తాడేపల్లిలో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వైసీపీ ఏం చేస్తుందనే దానిపై క్లారిటీ రానుంది.
AP: శిరోముండనం కేసులో శిక్ష నిలుపుదల చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు.. ఫిర్యాదు దారులకు కౌంటర్ వేయాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ మే 1కి వాయిదా వేసింది.
ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలోని ఆల్ఫా సూపర్ మార్కెట్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తర్వాత పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు కూడా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల వాళ్లు భయాందోళనకు గురయ్యారు.
ఎమ్మెల్యే కోడాలి నానికు బిగ్ షాక్ తగిలింది. సీనియర్ వైసీపీ నాయకుడు గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘ అధ్యక్షుడు దారం నరసింహారావు టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము పార్టీ కండువా కప్పి ఆహన్వించారు.
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
ఏపీ పదో తరగతి ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. పరీక్షలకు సంబంధించిన వాల్యుయేషన్, కోడింగ్, డీ కోడింగ్, కంప్యూటరీకరణ అన్ని పూర్తవ్వడంతో అధికారులు ఫలితాలను ఆన్ లైన్ లో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు.
ఆంధ్రా సీఎం జగన్‌పై దాడి కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. నిన్నటి వరకు నిందితులు ఇద్దరు అని చెప్పారు. సతీష్ అనే వ్యక్తి చేత దుర్గారావు అనే వ్యక్తి కొట్టించాడు అన్నారు. కానీ ఈరోజు దుర్గారావుకు ఈ దాడితో సంబంధం లేదని చెబుతున్నారు పోలీసులు.
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏపీలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీ నేత కొణిజేటి ఆదినారాయణ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీఫామ్ ఇవ్వాలని కేసీఆర్‌ను కలిసి కోరనున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆస్తులు భారీగా పెరిగాయి. వారి ఉమ్మడి సంపద 2019 నుండి దాదాపు 39% పెరిగింది. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఈ వివరాలను వెల్లడించారు