AP CM Jagan : రాయి దాడిపై స్పందించిన జగన్

దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతోనే తాను రాయి దాడిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని జగన్ అన్నారు. తన యాత్రకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేకే దాడి జరిగిందని ఆరోపించారు. రాయి దాడి తర్వాత తొలిసారిగ కృష్ణా జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు.

New Update
AP CM Jagan : రాయి దాడిపై స్పందించిన జగన్

AP CM Jagan : ఈ నెల 13న రాయి దాడి జరిగిన తర్వాత డాక్టర్ల సూచన మేరకు నిన్న విశ్రాంతి తీసుకున్న వైసీపీ(YCP) అధినేత, ఏపీ సీఎం జగన్(YS Jagan) ఈ రోజు మళ్లీ ఎన్నికల ప్రచారం(Election Campaign) ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో ఆయన బస్సు యాత్ర(Bus Yatra) నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాయి దాడిపై ఆయన తొలిసారి స్పందించారు. తన ప్రచారానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తట్టుకోలేకనే రాయి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి దాడులు తమను ఆపలేవన్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతోనే తాను రాయి దాడిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అన్నారు. మరోవైపు దాడి నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నిఘా నీడలో జగన్ పర్యటన సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు