AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. నేతలపై అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టినందుకే ఇతనిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం రవీందర్ రెడ్డిని కడప పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.

author-image
By Manogna alamuru
ycp
New Update

YSP Social Media activist Arrest: 

నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్రా రవీందర్ రెడ్డి సొంత ఊరు పులివెందుల. ఇతను ఒకప్పుడు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడని సమాచారం. వర్రా రవీందర్ రెడ్డిని పులివెందులలో అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప పీఎస్ కు తీసుకువచ్చారు. 

వర్రా రవీందర్ రెడ్డి గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితపై అసభ్యకర పోస్టులు పెట్టినట్టు గుర్తించారు. అంతేకాదు, షర్మిల, విజయమ్మపైనా అతడు అసభ్యకర పోస్టులు పెట్టిన విషయం కూడా బయటకు వచ్చింది. రవీందర్ రెడ్డిపై పులివెందుల, మంగళగిరి, హైదరాబాదులో పలు కేసులు ఉన్నాయి.

 

Also Read: AP: మెగా డిఎస్సీ కి పారదర్శకంగా, కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe