విజయవాడ to శ్రీశైలం సీ ప్లేన్ టూర్ ప్రారంభం.. నిమిషాల్లో చేరుకోవచ్చు

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ సీ ప్లేన్ 14 మంది కెపాసిటీతో ప్రయాణించనుంది.

Vijayawada to Srisailam seaplane
New Update

పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సీ ప్లేన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెడీ అయింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే స్పైస్ జెట్ నేతృత్వంలో విజయవాడ నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ లోకి సీ ప్లేన్ నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సీ ప్లేన్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. 

Also Read : ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన

తొలి సీ ప్లేన్ ప్రారంభం

విజయవాడ నుంచి తొలి సీ ప్లేన్ ఇవాళ (శనివారం) బయలుదేరింది. మధ్యాహ్నానానికి శ్రీశైలం చేరుకుంటుంది. కాగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద పున్నమి ఘాట్ దగ్గర సీ ప్లేన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. ఇక్కడ ప్రారంభించిన తర్వాత 12.45 గంటలకు సీ ప్లేన్ లో శ్రీశైలానికి చేరుకోనున్నారు. ఈ మేరకు నల్గొండ పనిధిలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ వద్ద సీ ప్లేన్ ల్యాండ్ అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 

Also Read :  సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!

ఇక అక్కడ నుంచి కిలో మీటర్ వరకు బోటులో ట్రావెల్ చేస్తే పాతాళగంగకు చేరుకుంటారు. ఆపై ప్రయాణికులు అక్కడి నుంచి రోప్ వే ద్వారా శ్రీశైలానికి చేరుకోవాలి. అనంతరం సీప్లేన్ కు చేరుకుంటారు. అక్కడ ఎక్కడానికి, దిగడానికి వీలుగా శ్రీశైలంలో వాటర్ వే ఏర్పాటు చేశారు. దీని కోసం జెట్టీలను రూపొందించారు. దాని సహాయంతో సీ ప్లేన్ ఎక్కాల్సి ఉంటుంది. కాగా ఈ పర్యాటన కోసం రెండు సీ ప్లేన్ లను అందుబాటులోకి తెచ్చారు. 

అందులో ఒకటి 14 సీట్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. అదే సమయంలో మరొకటి 19 సీట్ల కెపాసిటీని పొందుతుంది. ఈ సీ ప్లేన్ లో విజయవాడ నుంచి శ్రీశైలానికి కేవలం 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అయితే రోడ్డు మార్గాన రావాలంటే మాత్రం గంటల తరబడి ప్రయాణం చేయాల్సిందే.

ఎందుకుంటే అది ఘాట్ రోడ్డు కావడం.. 270 కి.మీ  దూరం ఉండడతో.. బస్సులు లేదా ఇతర వాహనాల్లో రావాలంటే దాదాపు 8 గంటల సమయం పడుతుంది. ఇక ఇవాళ ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభించాలి? అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది. అంతేకాకుండా రోజుకు ఎన్ని సర్వీసులు నడపాలి, టికెట్ ధర ఎంత ఉండాలి? అనే దానిపై కూడా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని ఏపీ టూరిజం అధికారులు చెప్పుకొస్తున్నారు. 

#seaplane
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe