Budameru Floods: వణుకుతున్న విజయవాడ.. బుడమేరకు మళ్లీ వరద ముప్పు?-VIDEO

బుడమేరకు మళ్లీ వరద ముప్పు ఉందన్న సోషల్ మీడియా వార్తలతో స్థానికులు వణికిపోతున్నారు. తెలంగాణ కురుస్తున్న భారీ వర్షాలతో వారు భయపడుతున్నారు. అధికారులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

New Update
Budameru Floods

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు విజయవాడ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతేడాది విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదను వారు గుర్తు చేసుకుని వణికిపోతున్నారు. మళ్లీ అలాంటి వరద వస్తుందేమోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వార్తల ప్రవాహం వారిని మరింత టెన్షన్ కు గురి చేస్తోంది. గతేడాది బుడమేరుకు ఎన్నడూ లేనంతగా 45 వేల క్యూసెక్కుల వరద నీరు చేరడంతో పలు చోట్ల గట్లు తెగాయి. దీంతో విజయవాడలోని పలు కాలనీలల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో దాదాపు పది రోజుల పాటు వరద ముంపు లోనే విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలు ఉన్నాయి. దీంతో అప్పటి ఈ జల ప్రళయాన్ని ప్రజలు మర్చిపోలేక పోతున్నారు.

సెప్టెంబర్ 1తో ఏడాది..

బుడమేరు కాలువ జలప్రళయానికి సెప్టెంబర్ 1 తో ఏడాది పూర్తి కానుంది. తెలంగాణ నుంచి ఈ బుడమేరుకు భారీగా వరద వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తుండడంతో బుడమేరు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు మరోసారి బుడమేరుకు వరద అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే.. అధికారులు ఈ అంశంపై స్పందించారు. తెలంగాణ వరదలకు బుడమేరు కు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో విపరీత వర్షాలు, ఇతర వాగులు, వంకలు ద్వారానే బుడమేరు కు వరద ముప్పు ఉంటుందని చెబుతున్నారు. 

మైలవరం కొండల నుంచి 162 కి.మీ ప్రవహించి కొల్లేరులో బడమేరు కలుస్తోంది. విజయవాడ నగరం మధ్య నుంచి ప్రవహించి ఎనికేపాడు యూటీ మీదుగా కొల్లేరు వరకూ బుడమేరు ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. బుడమేరులోకి ప్రధాన వాటర్ సోర్స్ గా వాగులు, వంకలు ఉంటాయి. ప్రస్తుతం సాధారణ వర్షాల నేపథ్యంలో బుడమేరుకు వరద ముప్పు లేదని అధికారులు చెబుతున్నారు. అయితే.. మళ్లీ గతేడాది లాంటి ప్రమాదాలు జరగకుమందే బుడమేరు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వరద ముప్పు నుంచి తమను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు